'కాలా' ముందుకు...
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ రజనీకాంత్ టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం 'కాలా'. వండర్ బార్స్ సంస్థ అధినేత అయిన హీరో ధనుష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు లైకా ప్రొడక్షన్స్ కూడా వన్ ఆఫ్ ది పార్ట్నర్గా వ్యవహరిస్తుంది. ముంభై నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హ్యుమా ఖురేషి, నానా పటేకర్, సముద్రఖని తదితరులు నటిస్తున్నారు.
రజనీకాంత్‌తో 'కబాలి' సినిమాను డైరెక్ట్ చేసిన దర్శకుడు పా రంజిత్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటం విశేషం. ఈ సినిమాను ఏప్రిల్ 14న విడుదల చేయడానికి నిర్మాతలు ఆలోచిస్తున్నారు. మరి రజనీకాంత్, శంకర్ '2.0' ఏమైంది? అనుకోవచ్చు. నిజానికి '2.0'ను ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకున్నారు.
కానీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఆలస్యమవుతుండటంతో ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేయబోతున్నారట. కాబట్టి రజనీకాంత్ కాలాను ముందుగా విడుదల చేయడానికి నిర్మాతలు రెడీ అవుతున్నారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments