కాలాకి తెలుగులో ఆదరణ కరువైందా?
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమా అంటే ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే రజనీకాంత్ లెటెస్ట్ మూవీ కాలా విషయంలో ఈ క్రేజ్ ఇసుమంతైనా కనపడటం లేదట. అందుకు కారణం.. రజనీకాంత్, పా.రంజిత్ కాంబినేషన్‌లో వచ్చిన `కబాలి` బాక్సాఫీస్ వద్ద ప్లాప్ కావడమే కాకుండా తెలుగు నిర్మాతలకు భారీ నష్టాలను తెచ్చిపెట్టిందట. దీంతో ఆ ఎఫెక్ట్ ఇప్పుడు కాలాపై పడిందట.
అదీ కాకుండా తమిళ నిర్మాతలు తెలుగు బయ్యర్స్‌కు భారీ రేట్స్ చెబుతున్నారట. అందుకని ఈ మధ్య తమిళ సినిమాలను తెలుగు బయ్యర్స్ కొనడానికి ఆసక్తి చూపడటం లేదట. కాలా తెలుగు రైట్స్ కోసం 12-15 కోట్ల రూపాయలను మాత్రమే వెచ్చించాలని తెలుగు బయ్యర్స్ ఆలోచిస్తున్నారట మరి. ఈ సినిమా ఏప్రిల్ 27న తెలుగులో విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments