తూచ్ అదేం లేదంటున్న సంస్థ...
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ రజనీకాంత్, సుముద్రఖని, నానా పటేకర్, హ్యుమా ఖురేషి, ఈశ్వరీరావు ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం 'కాలా'. లైకా ప్రొడక్షన్స్, వండర్స్ బార్స్ బ్యానర్స్ సినిమాను రూపొందిస్తున్నాయి. ధనుష్ నిర్మాత. సినిమాను ఏప్రిల్ 27న విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ముందుగా ప్రకటించారు.
అయితే నిన్న సోషల్ మీడియాలోతమిళ నిర్మాతల మండలి, డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్‌కు మధ్య ఉన్న గొడవ కారణంగా 'కాలా' విడుదల ఆలస్యమయ్యేలా ఉందని వార్తలు వినిపించాయి.
ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెడుతూ నిర్మాణ సంస్థల్లో ఒకరైన లైకా ప్రొడక్షన్స్ ప్రతినిధులు 'కాలా' రిలీజ్ డేట్ విషయంలో ఎటువంటి జాప్యం ఉండదని.. సినిమా పోస్ట్‌పోన్ అంటూ వస్తున్న వార్తలకు, తమకు సంబంధం లేదని తేల్చేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments