'కాలా' కథను తస్కరించారా?
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమా అంటే ఎంత క్రేజ్ ఉంటుందో అదే స్థాయిలో వివాదాలు కూడా ఉంటాయి. `లింగ` సినిమా సమయంలో కూడా సినిమాను వివాదాలు చుట్టుముట్టాయి. అలాగే ఇప్పుడు పా రంజిత్ దర్శకత్వంలో ధనుష్ నిర్మాతగా సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న `కాలా` విషయంలో కూడా వివాదం మొదలైంది.
కాలా కథ తనదంటూ కోలీవుడ్ అసిస్టెంట్ డైరెక్టర్ కె.రాజశేఖర్ అలియాస్ కె.ఎస్.నాగరాజు సిటీ కమిషనరేట్‌కు కంప్లైట్ ఇచ్చాడట. ఓ సారి రజనీకాంత్‌ను కలిసి లైన్ చెబితే పూర్తి కథను చెప్పమన్నాడట. తర్వాత ఇదే కథతో 2011లో ప్రొడక్షన్ స్టార్ట్ చేసినా సినిమా కొన్ని కారణాలతో ఆగిపోయిందని, ఇప్పుడు అదే కథతో కాలా సినిమాను రూపొందిస్తున్నారని పెర్కొన్నారు. ఈ కాపీ కంటెంట్‌పై దర్శక నిర్మాతలు ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments