ఆడపిల్లల నిర్ణయాలను గౌరవించాలనే 'కాదలి'
Send us your feedback to audioarticles@vaarta.com
చాలా మంచి మెసేజ్ ఉన్న చిత్రమిది. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఆడియోకి మంచి స్పందన వచ్చిందని హీరో సాయిరోనక్ తెలిపారు. పూజా కె. దోషి, హరీశ్ కల్యాణ్, సాయి రోణక్, సుదర్శన్, మోహన్ రామన్, డా. మంజేరి షర్మిల, గురురాజ్ మానేపల్లి తదితరులు నటించిన సినిమా `కాదలి`. పట్టాభి.ఆర్.చిలుకూరి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ సినిమా ఈ శుక్రవారం విడుదల కానుంది.
ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ఇంత మంచి సినిమాలో భాగమవుతానని అనుకోలేదు. చాలా హ్యాపీగా ఉంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని పూజా తెలిపారు.
యువకులకు బాగా నచ్చే అంశంతో ఈ సినిమా చేశాం. ఇద్దరు అబ్బాయిలు, ఓ అమ్మాయి మధ్య జరిగే కథ ఇది. శ్రీలంకలో ఓ రిస్కీ ప్లేస్‌లో మా నాయిక డ్యాన్స్ చేసింది. ఈ సినిమా హీరోలు ఇద్దరు ఒకరికి ఒకరు ఏమాత్రం తగ్గకుండా ఉంటారు. ఫీమేల్ సెంట్రిక్ సినిమా అనగానే బరువైన కథ అని అనుకోవద్దు. నేటి సమాజానికి చక్కగా సరిపోయే కథ ఇది. కాదలి అనే పదం ద్రవిడ పదం అని ఓ ఇంటర్వ్యూలో వేటూరిగారు అన్నారు. అందుకోసం ఈ పదాన్ని మా టైటిల్‌గా వాడామని దర్శకుడు పట్టాభి ఆర్. చిలుకూరి అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments