ఆనందయ్య విషయమై కేఏ పాల్ కీలక ప్రకటన
Send us your feedback to audioarticles@vaarta.com
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్యకు రోజురోజుకూ ప్రముఖుల నుంచి మద్దతు పెరుగుతోంది. సామాన్యుల నుంచి అనూహ్య మద్దతు పొందిన ఆయన ప్రస్తుతం ప్రముఖుల మద్దతును సైతం పొందుతున్నారు. ఇప్పటికే ప్రముఖ నటుడు జగపతిబాబు ఆయనను ప్రశంసించారు. తాజాగా.. ప్రముఖ మత గురువు కేఏ పాల్ కూడా ఆనందయ్యకు మద్దతుగా నిలిచారు. ఈ మేరకు కేఏ పాల్ ఓ వీడియోను విడుదల చేశారు. ఆనందయ్య గురించి కేఏ పాల్ ఆ వీడియోలో మాట్లాడుతూ.. ప్రైవేట్ ఆసుపత్రులు ఘోరంగా దోచుకుంటున్నాయన్నారు. తన తల్లి ప్రైవేట్ ఆసుపత్రి నిర్లక్ష్యం కారణంగానే చనిపోయిందని గుర్తు చేసుకున్నారు. అందరినీ అనలేమని.. కానీ కొంతమంది వైద్యులు మాత్రం దోచుకుతింటున్నారన్నారు.
ఇదీ చదవండి: లెగ్ పీస్ రాలేదంటూ కేటీఆర్‌కు ట్వీట్.. స్పందించాల్సిందేనన్న అసదుద్దీన్..
కరోనా ఉధృతి కారణంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ఇలాంటి సమయంలో ఆనందయ్యను మనకు దేవుడు వరంగా ఇచ్చారన్నారు. ప్రకృతి సహజంగా లభించిన మూలికలతో మందులను తయారు చేస్తున్న ఆనందయ్యను మనం కాపాడుకోవాలన్నారు. ఆయన ఉన్న చోటికి జాతీయ మీడియా వెళ్లి విచారణ జరపాలని కేఏ పాల్ కోరారు. సైడ్ ఎఫెక్ట్స్ లేవని సంస్థలే చెబుతున్నాయన్నారు. ఆనందయ్యను విడుదల చేయాలని సీఎం జగన్, డీజీపీ, కేంద్ర హోంమంత్రి, హైకోర్టు సీజేఐ, సుప్రీం సీజేఐలను కోరాలని సూచించారు. సరైన మందు లేని కరోనాపై పోరుకు ఆనందయ్య తమతో కలిసి నడవాలని కోరారు.
ఆనందయ్యను కస్టడీ నుంచి విడుదలచేయాలన్నారు. అంతేకాదు.. ఈ సందర్భంగా కేఏ పాల్ ఓ కీలక ప్రకటన సైతం చేశారు. ఆనందయ్యతో కలిసి తమ సంస్థ ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందని కేఏ పాల్ వెల్లడించారు. శిక్షణార్థులు ఎవరైనా ఉంటే తమ సంస్థ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేయించుకోవాలన్నారు. మందు తయారీకి కావలసిన మెటీరియల్స్ తెచ్చుకుంటే.. మందు తయారు చేసుకుని వెళ్లొచ్చన్నారు. కావలసిన ఏర్పాట్లు చేస్తామని, ఉచితంగా శిక్షణ అందిస్తామని కేఏ పాల్ వెల్లడించారు. ఆనందయ్య బయటకు రాగానే మాట్లాడదామన్నారు. సెక్యురిటీ పేరుతో ఆయనను నిర్బంధించారని.. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout