'ఏపీలోని 175 స్థానాల్లో పోటీ.. నియోజకవర్గానికి వంద కోట్లిస్తా'

  • IndiaGlitz, [Tuesday,January 08 2019]

ఏపీలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రధాన పార్టీలన్నీ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఎప్పట్నుంచో గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టేశాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే సంక్రాంతి తర్వాత వైసీపీ, టీడీపీ, జనసేన అధినేతలు వారి పార్టీల అభ్యర్థులను కూడా ప్రకటించడానికి సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో తమ పార్టీ కూడా బరిలో ఉంటుందని.. ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండానే బరిలోకి దిగుతుమంటూ ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ తేల్చిచెప్పారు. సోమవారం నాడు రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఏపీలోని 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తానని.. ప్రజాశాంతి పార్టీ గెలిస్తే ఒక్కో నియోజకవర్గం అభివృద్ధి కోసం రూ.100 కోట్లు విరాళంగా ఇస్తానని పాల్ సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుతానికి అయితే ఏ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు తాము సిద్ధంగా లేమని.. ఒకవేళ పొత్తు పెట్టుకోవాల్సి వస్తే ఐదో, పదో సీట్లు ఇస్తామని.. ఎవరితో అనేది మార్చిలో తేలుస్తామన్నారు. అంతటితో ఆగని ఆయన.. 20 రోజుల్లో ప్రజాశాంతి పార్టీ ప్రభంజనం సృష్టించబోతోందని తనకు తానుగా జోస్యం చెప్పుకున్నారు. పార్టీలో వెయ్యిమందిని చేర్పించిన వారికి మూడువేల రూపాయిలు చొప్పున నగదు ఇస్తానని.. ఎక్కువ మందిని చేర్పించిన వారికి ఎమ్మెల్యే సీటిస్తామని కూడా ప్రకటన చేశారు.

అయితే.. పాల్ ప్రకటనతో నవ్వుకున్నోళ్లు నవ్వుకున్నారు.. నమ్మే వాళ్లు నమ్మారు.. ఇక సోషల్ మీడియాలో అయితే బాబోయ్ ఇన్ని రోజులు ఒకటి అర ఇంటర్వ్యూల్లోనే ఇప్పుడు ఏకంగా మీడియా ముందుకే వచ్చేశావా సామీ.. ఇక కామెడీకి కొదవేమీ ఉండదులే అంటూ సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. ఇవన్నీ అటుంచితే ఆయనకు ఒకప్పుడు విదేశాల్లో ఏ రేంజ్‌‌లో పేరున్నదో అందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల వల్ల ఆయన తెలుగు రాష్ట్రాల ప్రజలకు కనిపించకుండా వెళ్లిపోయారు. త్వరలో ఎన్నికల దగ్గరపడుతున్న సమయంలో ఆయన మళ్లీ ప్రత్యక్షమవ్వడంతో ఆయన అసలేం చేయబోతున్నారు..? మళ్లీ పాత పాల్ క్రీజులోకి వచ్చేశారా..? అనేది తెలియరాలేదు. అయితే ఒకవేళ పాల్ ఫుల్‌పిల్‌‌గా ఏపీలో పోటీ చేస్తే పరిస్థితి ఎలా ఉండబోతోందన్నది ఆ పెరుమాళ్లకే ఎరుక.

More News

సర్వే సత్యనారాయణ కాంగ్రెస్‌‌కు కోలుకోలేని షాక్ ఇవ్వనున్నారా..!?

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్య నారాయణ కారెక్కనున్నారా..? సొంత పార్టీ నేతలే ఆయన్ను పొమ్మనలేక పొగపొడుతున్నారా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే అవుననే అనిపిస్తోంది.

‘ఆకుల’ ప్రకటనతో ఏపీ బీజేపీలో ఆల్ హ్యాపీస్..!

రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే(బీజేపీ) ఆకుల సత్యనారాయణ రాజీనామా చేసినట్లు సోమవారం నాడు పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పుకార్లు వచ్చిన సమయంలో ఆకుల ఢిల్లీలోనే ఉండటంతో బీజేపీ జాతీయాధ్యక్షుడు..

నిర్మాత రాజ్ కందుకూరి కుమారుడు శివ కందుకూరి చిత్రం షూటింగ్ ప్రారంభం..

ఇటీవల పెళ్లి చూపులు, మెంటల్ మదిలో చిత్రాలని నిర్మించి నేషనల్ ఆవార్డ్, ఫిల్మ్ ఫేర్ ఆవార్డులని పొందిన రాజ్ కందుకూరి.. ఇప్పుడు ధర్మపథ క్రియేషన్స్ పై మరో లెడీ డైరెక్టర్ ని సినిమా

నాకు విన‌ప‌డుతుంద‌య్యా..!

ఇది హై క‌మాండ్ తీసుకున్న నిర్ణ‌యం రెడ్డి.. యు హేవ్ టు ఓబే పార్టీ ఆర్డ‌ర్స్‌

శ్రీదేవి బయోపిక్‌కి బోనీ నిర్మాత

జాతీయ స్థాయిలో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో ఒకరు అందాల తార శ్రీదేవి. దక్షిణాది చిత్రాలతోపాటు హిందీలోనూ పలు సూపర్‌హిట్ చిత్రాల్లో నటించిన ఆమె హఠాత్తుగా చనిపోవడం అందర్నీ బాధించింది.