నన్ను అవమానించాడు.. 'అమ్మరాజ్యం' ప్లాప్: పాల్

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘అమ్మరాజ్యంలో కడపబిడ్డలు’ అనేక వివాదాలు.. మరెన్నీ కోర్టు చీత్కారల నడుమ ఎట్టకేలకు రిలీజ్‌కు నోచుకున్న సంగతి తెలిసిందే. రిలీజ్ అయ్యి రెండ్రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమాపై పలురకాలుగా అభిమానులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ పాత్ర కూడా ఉన్న సంగతి తెలిసిందే. అయితే తన పాత్రను తీసేయాలని రిలీజ్‌కు మునుపే ఆర్జీవీని కోరినప్పటికీ ఆయన అస్సలు వెనక్కి తగ్గలేదు. సినిమా రిలీజ్ అయ్యింది.. జరగాల్సింది జరిగిపోయింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే పాల్ కోడలు మీడియా ముందుకొచ్చి ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు చేయగా.. తాజాగా ఆయనే మైక్ గొట్టాల ముందుకొచ్చి వర్మపై దుమ్మెత్తిపోశారు.

శాస్తి జరిగింది.. సత్యం గెలిచింది!

‘ఆర్జీవీది ఒక పిచ్చి సినిమా. ఈ చిత్రం ద్వారా కులాల మధ్య, మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేశారు. నా సీన్లతో సినిమా రిలీజ్ అవ్వదని నేను ముందే చెప్పాను. అయితే నా మాట వినకుండా అపహాస్యం చేశారు. నేను చేసిన ప్రార్థనలు, చట్టం సహకారంతో.. ఎక్కడా నా పేరు ఉపయోగించకుండా చేశాం. సత్యమే గెలిచింది. ఆర్జీవీకి దేవుడు, చట్టం, కోర్టు, సెన్సార్ బోర్డు బుద్ధి చెప్పాయి. ఇప్పుడైనా మార్పు చెందుతాడని అనుకుంటే మారలేదు. ఆర్జీవీకి తగిన శాస్తి జరుగుతుంది. ప్రజల్లో శాంతిని ప్రచారం చేస్తున్న నన్ను అవమానపరిచాడు. అందుకే.. మూవీ ఫ్లాప్ అయ్యింది. ఆయనలో గర్వం తగ్గింది. ముఖం చూపించుకోలేకపోయాడు. ఇంకా చైనా నుంచి వచ్చాడో లేదో తెలియదు’ అని ఆర్జీవీని కేఏ పాల్‌ మీడియా వేదికగా ఓ ఆట ఆడుకున్నారు.

ఎవరో డబ్బులిస్తే...!

అంతటితో ఆగని ఆయన.. ఇకనైనా ఆర్జీవీ ఇలాంటి చీప్ పబ్లిసిటీ మానుకోవాలని హితవు పలికారు. తనకు, దేవుడికి, ప్రజలకు క్షమాపణ కోరితే.. మళ్లీ భవిష్యత్తులో విజయం పొందొచ్చని పాల్ జోస్యం చెప్పారు. అలా కాని పక్షంలో లేదంటే చరిత్రహీనుడిగా మిగిలిపోతాడని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఆర్జీవీని కుటుంబం, ప్రజలు వెలివేశారని.. ముంబై వెళితే అక్కడ సినిమాలు లేవని.. ఇప్పుడేమో ఆంధ్రాలో కూడా సినిమాల్లేవని దీంతో ఏం చేయాలో దిక్కుతోచక.. ఎవరో డబ్బులిస్తే సినిమా చేశారని ఆర్జీవీపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. అయితే తనపై చీమ వాలినా సరే అంతెత్తు ఎగిరే ఆర్జీవీ.. పాల్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

More News

జనసేనకు భవిష్యత్ లేదు.. పవన్‌కు...: రాపాక సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీచేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఘోరంగా ఓటమిపాలైనప్పటికీ.. ఆ పార్టీ తరఫున పోటీచేసిన రాపాక వరప్రసాద్ గెలిచి తన సత్తా ఏంటో చూపించుకున్నాడు.

అయేషా తల్లి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రోజా రియాక్షన్...

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విజయవాడ అయేషా మీరా హత్య కేసు ఇప్పుడు సీబీఐ చేతుల్లోకి వెళ్లింది. దీంతో విచారణ మరింత వేగవంతమైంది. రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు

అయేషా పోస్టుమార్టంలో తాజాగా సీబీఐ ఏం తేల్చింది!?

విజయవాడలో దారుణ హత్యకు గురైన ఆయేషామీరా హత్య కేసు అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో తమకు న్యాయం ఇంతవరకూ జరగట్లేదని బాధితురాలి

గోపీచంద్‌ - సంపత్‌నంది కాంబినేషన్లో భారీ చిత్రం ప్రారంభం

మ్యాచోస్టార్‌ గోపీచంద్‌ హీరోగా మాస్‌ డైరెక్టర్‌ సంపత్‌ నంది దర్శకత్వంలో 'యు టర్న్‌'లాంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.3 గా శ్రీనివాసా

'కె.జి.య‌ఫ్' అభిమానులకు గుడ్ న్యూస్

రాకింగ్ స్టార్ య‌ష్ హీరోగా.. కైకాల స‌త్య‌నారాయ‌ణ స‌మ‌ర్ప‌ణ‌లో హోంబ‌లే ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ కిర‌గందూర్ నిర్మిస్తోన్న‌ భారీ బ‌డ్జెట్ చిత్రం `కె.జి.య‌ఫ్‌` చాప్ట‌ర్ 2.