'కూనిరాగాలు' ఆవిష్కరించిన కళాతపస్వి కె.విశ్వనాధ్

  • IndiaGlitz, [Wednesday,January 10 2018]

కూనిరెడ్డి శ్రీనివాస్ రాసిన కవితా సంపుటి 'కూనిరాగాలు' ను కళాతపస్వి, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ గ్రహీత కె.విశ్వనాధ్ ఆవిష్కరించారు. తొలి ప్రతిని సూర్య పత్రికాధినేత, ప్రముఖ నిర్మాత నూకారపు సూర్యప్రకాశరావు స్వీకరించారు. ఈ కవితా సంపుటిని శ్రీనివాస్.. నూకారపు సూర్యప్రకాశరావుకు అంకితమిచ్చారు. 'కూనిరాగాలు' చాలా బాగున్నాయని.. కూనిరెడ్డి శ్రీనివాస్ ముందు ముందు మరిన్ని పుస్తకాలు రాయాలని కె.విశ్వనాధ్ ఆశీర్వదించారు.

స్వతహా మంచి సాహితీప్రియుడయిన శ్రీనివాస్ 'కూనిరాగాలు' పేరుతో వెలువరించిన పుస్తకాన్ని తనకు అంకితమివ్వడం సంతోషంగా ఉందని నూకారపు అన్నారు. కె.విశ్వనాధ్ వంటి లెజెండ్ తన కవితా సంపుటిని ఆవిష్కరించడం, తన శ్రేయోభిలాషి, మార్గదర్శి సూర్యప్రకాశరావు ఈ పుస్తకాన్ని అంకితం తీసుకొని, ఈ కార్యక్రానికి హాజరై తొలిప్రతిని స్వీకరించడం ఎంతో సంతోషంగా ఉందని కూనిరెడ్డి అన్నారు.

ఈ పుస్తకావిష్కరణలో ప్రముఖ దర్శకులు 'డమరుకం' ఫేమ్ శ్రీనివాస్ రెడ్డి, ప్రముఖ రచయిత సాయినాథ్ తోటపల్లి, సంగమమ్ అకాడమీ సంజయ్ కిశోర్, డాక్టర్ శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు!!

More News

26 ఏళ్ల 'చంటి'

చిన్నప్పట్నుంచి పాటలు,తల్లి,తల్లి ప్రేమ తప్ప మరేమీ తెలియని ఒక అమాయకుడికి..

'లక్కీఫెలో' సినిమా 'లవ్‌లీ' కంటే పెద్ద హిట్‌ అవుతుంది - డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి.

జర్నలిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించి రచయిత్రిగా, 'సూపర్‌హిట్‌' పత్రిక జనరల్‌ మేనేజర్‌గా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న జయ బి, సినిమాల మీద మక్కువతో 'చంటిగాడు' చిత్రంతో దర్శకురాలిగా మారి 'గుండమ్మగారి మనవడు', 'లవ్‌లీ' 'వైశాఖం' లాంటి ఫీల్‌గుడ్‌ మూవీస్‌ని ప్రేక్షకులకందించి దర్శకురాలిగా తనకంటూ ఓ స్పెషల్‌ ఇమేజ్‌ని తెచ్చుకున్నా

'టిక్ టిక్ టిక్‌' టీజ‌ర్ విడుద‌ల‌

జ‌యం ర‌వి, నివేదా పేతురాజ్ హీరో హీరోయిన్లుగా చ‌ద‌ల‌వాడ బ్ర‌ద‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర ఫిలింస్ బ్యాన‌ర్‌పై శ‌క్తి సౌంద‌ర్ రాజ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌ద్మావ‌తి చ‌ద‌ల‌వాడ నిర్మాతగా వ‌స్తోన్న   చిత్రం 'టిక్ టిక్ టిక్‌'.

మహానటిలా నేను చేయలేనని అన్నా - కీర్తి

మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా ‘మహానటి’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

నిఖిల్ కి జోడీగా కేథరిన్

విభిన్న పాత్రలను చేయడానికి ముందుండే కథానాయకులలో