దర్శకుడి తమ్ముడని అవకాశం రాలేదు - వేదా.కె

  • IndiaGlitz, [Monday,February 22 2016]

మంచు మనోజ్, రెజీనా హీరో హీరోయిన్లుగా బేబి త్రిష సమర్పణలో సురక్ష ఎంటర్ టైన్మెంట్ ప్రై.లి. బ్యానర్ పై కె.దశరథ్ దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ నిర్మించిన చిత్రం శౌర్య. ఈ చిత్రం మార్చి 4న విడుదలవుతుంది.

ఈ సందర్భంగా సంగీత దర్శకుడు వేదా.కె మాట్లాడుతూ ......

-ఖమ్మంలో పుట్టాను. ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.ఫిల్ మ్యాథమాటిక్స్ చేశాను ఆరేళ్ళు హిందూస్థానీ హర్మోనియం నేర్చుకున్నాను. కర్ణాటక సంగీతం కూడా నేర్చుకున్నాను. . వెస్ట్రన్ క్లాసికల్ పియానోలో 5 గ్రేడ్స్ చేశాను. జింగిల్స్, టీవీ సీరియల్స్ కు టైటిల్ మ్యూజిక్ ఇచ్చాను. ముందు దేవిశ్రీ ప్రసాద్ గారి వద్ద అప్రెంటీస్ గా వర్క్ చేశాను. తర్వాత చక్రిగారి దగ్గర వెన్నెల్లో హాయ్ హాయ్, అనుచరుడు సినిమాలు సహా ఆయన చివరి సినిమా ఎర్రబస్బు వరకు పనిచేశాను.

-చిన్నప్పటి నుండి సంగీతం అంటే ఇష్టమున్నప్పటికీ ఆర్ధిక కారణాలతో కుదరలేదు. నారాయణలో హోం ట్యూటర్ గా చేస్తున్నప్పుటి నుండి సంగీతం నేర్చుకోవడం మొదలు పెట్టాను. కొద్దిగా ఆలస్యమైనా సంగీతంపై పట్టు సాధించాను. సాఫ్ట్ వేర్ లో ఐదేళ్ళు వర్క్ చేశాను. అనూప్ గారి దగ్గర నైట్ టైమ్స్ డివోషనల్ సాంగ్స్ చేసేవాడిని.

-దశరథ్ గారి బ్రదర్ అనే కారణంతో శౌర్య' సినిమాలో అవకాశం రాలేదు. సినిమా వ్యాపారం కోట్ల రూపాయలతో ఉంటుంది. అందుకే నేను డైరెక్టర్ గారి తమ్ముడినని చెప్పకుండా రెండు సిచ్చువేషన్స్ కు ట్యూన్స్ కంపోజ్ చేసి నిర్మాతగారికి, మనోజ్ గారికి వినిపించాను. వాళ్ళకు ఆ రెండు ట్యూన్స్ నచ్చి మరో ట్యూన్ కూడా చేయమని అన్నారు. అప్పుడు తుప్పర... సాంగ్ ట్యూన్ చేసి వినిపించాను. వారికి నచ్చడంతో వారు మ్యూజిక్ డైరెక్టర్ గా అవకాశం ఇచ్చారు.

-మ్యూజిక్ లో ఇళయరాజాగారు, రెహమాన్ గారి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. రెహమాన్ గారు పాత్ బ్రేకింగ్ మ్యూజిక్ ఇచ్చారు. మ్యూజిక్ పరిధులు దాటించిన వ్యక్తి. మన కల్చర్ సాంగ్స్ వింటే ఎంత గొప్ప వాడైనా కనెక్ట్ అవుతాం.

-జనరల్ గా మెలోడి సాంగ్స్ చేయడమిష్టం. అలాగే మన కల్చర్ తో కూడిన ఫోక్ మ్యూజిక్ చేయడం కూడా ఇష్టపడతాను.

- అయితే శౌర్య రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాను. కొత్త సినిమాలేవీ చేయడం లేదు. మ్యూజిక్ దర్శకుడిగా కొంతమంది వర్క్ చేయమని అడుగుతున్నారు.