ముగ్గురు హీరోయిన్లతో కలిసి నటించనున్న కె.రాఘవేంద్రరావు..
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు నటుడి అవతారమెత్తబోతున్నారు. కొత్త మూవీలో లీడ్ రోల్ పోషించేందుకు సర్వం సిద్ధమైంది. అది కూడా ముగ్గురు హీరోయిన్లతో నటించబోతున్నారు. తన కెరీర్‌లో 100కు పైగా సినిమాలకు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. అయితే ఇప్పటి వరకూ ఆయన ఏ సినిమాలోనూ నటించింది లేదు. ఈ డిఫరెంట్ పిక్చర్ కోసం సినిమాలో త్రిష, శ్రీయ, రమ్యకృష్ణ హీరోయిన్లుగా ఎంపికయ్యారు.
ఈ చిత్రాన్ని ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించనున్నట్టు తెలుస్తోంది. 78 ఏళ్ల వయసులో రాఘవేంద్రరావును ఈ సినిమాకు నిర్మాణ సంస్థ ఎలా ఒప్పించిందనేదే ఆసక్తికర విషయం. అయితే ఇప్పటి వరకూ ముగ్గురు హీరోయిన్లూ ఈ చిత్రానికి సైన్ అయితే చేయలేదు కానీ అంగీకారం మాత్రం తెలిపినట్టు సమాచారం. అయితే తనకు హీరోయిన్‌గా లైఫ్ ఇచ్చిన రాఘవేంద్రరావుతో నటించేందుకు రమ్యకృష్ణ అయితే నో చెప్పరు. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలోనే ఈ సినిమాను చిత్రబృందం అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments