గోదారిలో బోటు ప్రమాదం వెనుక పెద్ద స్కాం ఉంది
Send us your feedback to audioarticles@vaarta.com
తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఘోర బోటు ప్రమాదం వెనుక పెద్ద స్కాం ఉందని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. స్థానిక పోలీసులు, బోట్ డ్రైవర్ కాల్ డేటా బయటకు తీయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. కాగా ఈ ప్రమాదంపై ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు, టీడీపీ అధినేత, మాజీ ఎంపీ హర్షకుమార్ లాంటి నేతలు భిన్న స్వరాలు వినిపించిన విషయం విదితమే. అయితే తాజాగా నెహ్రూ మరోసందేహాన్ని తెరపైకి తెచ్చారు. నెహ్రూ ఇవన్నీ రాయేస్తే పోలా అని మాట్లాడారా.? లేకుంటే ఇందులో నిజానిజాలున్నాయా..? ఇవన్నీ కాకపోతే జ్యోతుల దగ్గర ఏమైనా ఆధారాలున్నాయా..? అనేది తెలియాల్సి ఉంది. ఒక వేళ ఆధారాలుంటే బయటపెడితే మంచిదేనేమో.
రివర్స్ టెండరింగ్ లాగే రివర్స్ ఎగ్జామ్!
అంతటితో ఆగని ఆయన.. సచివాలయ ఉద్యోగాల భర్తీలో పారదర్శకత లేదని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. రివర్స్ టెండరింగ్ లాగే రివర్స్ ఎగ్జామ్స్ నిర్వహించాలి అని ఈ సందర్భంగా జ్యోతుల డిమాండ్ చేశారు. 196 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యం ఉన్నా.. పోలవరం ఇప్పుడు 60 టీఎంసీలు తగ్గే అవకాశం ఉందన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో స్నేహం కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టవద్దని ఏపీ ప్రభుత్వానికి నెహ్రూ సూచించారు. అయితే జ్యోతుల వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments