12 ఏళ్ల తర్వాత మళ్లీ సినిమా చేస్తున్నాడా..?
Send us your feedback to audioarticles@vaarta.com
తరుణ్, త్రిష, శ్రియ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం నీ మనసు నాకు తెలుసు. ఈ సినిమాని సూర్యా మూవీస్ పతాకంపై ఎ.ఎం.రత్నం నిర్మించారు. ఎ.ఎం.రత్నం తనయుడు ఎ.ఎం.జ్యోతిక్రిష్ణ ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా వచ్చి దాదాపు 12 ఏళ్లు అవుతుంది. ఇప్పుడు జ్యోతిక్రిష్ణ తన తదుపరి చిత్రాన్నితెలుగు ప్రేక్షకులకు అందించేందుకు రెడీ అవుతున్నారు.
అయితే జ్యోతిక్రిష్ణ తీసే సినిమాకి హీరోగా గోపీచంద్ ను సెలెక్ట్ చేసుకున్నాడు. ఇటీవలే జ్యోతిక్రిష్ణ గోపీచంద్ ని కలసి కథ చెప్పడం..కథ విని గోపీచంద్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందట. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి స్ర్కిప్ట్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే ఈ మూవీని ఎనౌన్స్ చేస్తారట. మరి..12 ఏళ్ల గ్యాప్ తరువాత జ్యోతిక్రిష్ణ తెలుగు ప్రేక్షకులకు ఎలాంటి సినిమాని అందిస్తాడో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com