అరవింద్ స్వామికి జోడీగా జ్యోతిక
Send us your feedback to audioarticles@vaarta.com
లెజండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి, శింబు, ఫాహద్ ఫాజిల్, జ్యోతిక, అదితిరావ్ హైదరీ, ఐశ్వర్యా రాజేష్, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం తెలుగులో 'నవాబ్' పేరుతో విడుదల కానుండగా.. తమిళంలో 'చెక్క చివంత వానమ్' పేరుతో రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో అరవింద్ స్వామికి జోడీగా జ్యోతిక పాత్ర ఉంటుందని తెలిసింది. వీరిద్దరు దంపతుల పాత్రలో కనిపించనున్నారని సమాచారం.
గతంలో జ్యోతిక సోదరి నగ్మా.. అరవింద్ స్వామికి జోడీగా 'మౌనం' అనే తెలుగు చిత్రాన్ని చేసింది. మళ్ళీ ఇప్పుడు అరవింద్ స్వామితో జ్యోతిక సినిమా చేస్తుండడం విశేషంగానే చెప్పుకోవాలి. డబుల్ ఆస్కార్ అవార్డ్స్ గ్రహీత ఎ.ఆర్.రెహమాన్ సంగీతమందిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం చెన్నైలో స్ట్రయిక్ నడుస్తున్న కారణంగా ఈ సినిమా షూటింగ్‌కి బ్రేక్ పడింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com