‘జీ 5’లో జ్యోతిక, కార్తీ నటించిన ‘దొంగ’ వరల్డ్ డిజిటల్ ప్రీమియర్
Send us your feedback to audioarticles@vaarta.com
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఓ స్పెషల్ సినిమాను ‘జీ 5’ ఒటీటీ తెలుగు ప్రజల ముందుకు తీసుకొస్తోంది. లాక్‌డౌన్‌లో డైరెక్ట్–టు–డిజిటల్ ఎక్స్‌క్లూజివ్ రిలీజ్ సినిమాలు ‘అమృతరామమ్’, ‘47 డేస్’, ‘బెలూన్’, ఇటీవల ఒరిజినల్ మూవీ ‘మేక సూరి’ సహా కామెడీ సిరీస్ ‘అమృతం ద్వితీయం’, పలు ఒరిజినల్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ‘గాడ్స్ ఆఫ్ ధర్మపురి’, ‘లూజర్’ వంటివి ‘జీ 5’లో విడుదలయ్యాయి. ఇప్పుడీ ఓటీటీలో మరో సినిమా విడుదల కానుంది.
జ్యోతిక, కార్తీ కలిసి నటించిన తొలి చిత్రం ‘దొంగ’. నిజ జీవితంలో వదిన, మరిది అయిన వీళ్లిద్దరూ ఈ చిత్రంలో అక్కాతమ్ముళ్లుగా నటించడం విశేషం. ఆగస్టు 14న ఈ సినిమా ‘జీ 5’లో విడుదల కానుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘దొంగ’ వరల్డ్ డిజిటల్ ప్రీమియర్‌కి ‘జీ 5’ సిద్ధమైంది. ‘దృశ్యం’ మాతృక, మలయాళంలో ఘన విజయం సాధించిన ‘దృశ్యం’ చిత్రానికి దర్శకత్వం వహించిన జీతూ జోసేఫ్ ఈ చిత్రానికి దర్శకుడు. సత్యరాజ్ తండ్రి పాత్ర పోషించిన ఈ చిత్రంలో కార్తీ సరసన ‘మేడ మీద అబ్బాయి’, ‘గాయత్రి’ ఫేమ్ నిఖిలా విమల్ నటించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com