బాలీవుడ్ రీమేక్ లో జ్యోతిక...

  • IndiaGlitz, [Sunday,February 18 2018]

హీరో సూర్య‌ను పెళ్లి చేసుకుని సినిమాల నుండి తాత్కాలికంగా గ్యాప్ తీసుకున్న జ్యోతిక ఇప్పుడుసినిమాల్లో న‌టిస్తుంది. 36 వ‌య‌దినిలే, మ‌గ‌లిర్ మ‌ట్రుమ్‌, నాచియార్ చిత్రాల్లో న‌టించిన జ్యోతిక ఇప్పుడు ఓ హిందీ రీమేక్‌లో న‌టించ‌డానికి సిద్ధ‌మైంది. హిందీలో విద్యాబాల‌న్ న‌టించిన 'తుమ్హారీ సులు' సినిమా అక్క‌డ మంచి విజ‌యాన్ని సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను ఇప్పుడు త‌మిళంలో రీమేక్ చేయ‌బోతున్నారు. ఈ సినిమాను త‌మిళంలో రాధామోహ‌న్ డైరెక్ట్ చేయ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌టిన రానుంది.