హీరోయిన్స్‌పై జ్యోతిక కామెంట్...
- IndiaGlitz, [Friday,September 11 2015]
సినిమాల్లో ఫిజిక్ కంటే పెర్‌ఫార్మెన్స్ ముఖ్యమంటుంది నటి జ్యోతిక. హీరోయిన్‌గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న జ్యోతిక సూర్యను పెళ్ళి చేసుకున్న తర్వాత సినిమా రంగానికి దూరమైంది. దాదాపు ఏడేళ్ళు గ్యాప్ తీసుకున్న జ్యోతిక రీసెంట్‌గా '36వయదినిలే' చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ కొట్టింది.
ఇప్పటి తరం హీరోయిన్స్ ఎక్కువ మంది తమ ఫిజిక్ కోసం సర్జరీలు చేయించుకుంటున్నారు. దాన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండటమే కాదు, ఎక్స్‌ప్రెషన్స్ కూడా పోతాయి. అందువల్ల వాళ్లు పెర్‌పార్మెన్స్ విషయంలో వెనకపడిపోతారు. నటన విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే వచ్చే కాన్ఫిడెన్స్ లెవల్స్ డిఫరెంట్ గా ఉంటాయని చెప్పుకొచ్చింది. మరి జ్యోతిక ఎవరిని ఉద్దేశించి అందో మరి...