సూర్య, కార్తీ తరువాతనే జ్యోతిక
Send us your feedback to audioarticles@vaarta.com
మణిరత్నం లాంటి డైరెక్టర్‌తో పనిచేయాలని ఎవరికి ఉండదు? అయితే హీరోయిన్‌గా మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు ఆ అవకాశాన్ని అందుకోలేకపోయింది జ్యోతిక. అయితే ఆయన నిర్మాణంలో తెరకెక్కిన 'డుమ్ డుమ్ డుమ్'లో మాత్రం హీరోయిన్‌గా నటించి సరిపెట్టుకుంది. కథానాయకుడు సూర్యని పెళ్లాడిన జ్యోతిక క్రమేణా సినిమాలకు దూరమైంది. మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్‌కి శ్రీకారం చుట్టిన ఈ అభినేత్రి రెండేళ్ల క్రితం '36 వయదినిలే'తో పలకరించింది.
ఇక ఆమె కొత్త చిత్రం 'మగళిర్ మట్టుమ్' ఈ నెల 15న రిలీజ్ కాబోతోంది. బాల దర్శకత్వంలోనూ 'నాచియార్' అనే సినిమా చేస్తోంది జ్యోతిక. ఈ చిత్రాలతో పాటు ఆమె ఖాతాలో మణిరత్నం రూపొందించబోయే కొత్త చిత్రం కూడా ఉందని తమిళ నాట వార్తలు వినిపిస్తున్నాయి. 13 ఏళ్ల క్రితం మణిరత్నం రూపొందించిన 'యువ' కోసం జ్యోతిక భర్త సూర్య నటించిన సంగతి తెలిసిందే. అలాగే ఈ సంవత్సరం కార్తీతో 'చెలియా'ని మణితర్నం తెరకెక్కించారు. ఇప్పుడు సూర్య కుటుంబంలో జ్యోతిక వంతు. సూర్య, కార్తీతో మణిరత్నం రూపొందించిన చిత్రాలు కమర్షియల్‌గా వర్కవుట్ కాలేదు. మరి జ్యోతిక ముఖ్య పాత్రలో నటించే సినిమా అయినా వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments