యు.ఎస్ లో హాఫ్ మిలియన్ మార్క్ క్రాస్ చేసిన జ్యోఅచ్యుతానంద..!
Send us your feedback to audioarticles@vaarta.com
నారా రోహిత్, నాగ శౌర్య, రెజీనా కాంబినేషన్లో అవసరాల శ్రీనివాస్ తెరకెక్కించిన చిత్రం జ్యోఅచ్యుతానంద. ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్ర బ్యానర్ పై సాయి కొర్రపాటి నిర్మించారు. ఇటీవల రిలీజైన జ్యోఅచ్యుతానంద చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్ సీస్ లో కూడా మంచి కలెక్షన్స్ వసూలు చేస్తుంది.
యు.ఎస్ లో ఫస్ట్ వీక్ కంటే సెకండ్ వీక్ మంచి కలెక్షన్స్ రాబట్టింది. జ్యో అచ్యుతానంద సెకండ్ వీక్ శుక్రవారం $ 39,243, శనివారం $ 72,347. మొత్తం : $ 523,240 (Rs. 3.51 Crore) వసూలు చేసింది అంటే హాఫ్ మిలియన్ మార్క్ క్రాస్ చేసిందని ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ ట్విట్టర్ ద్వారా తెలియచేసారు. ఈ మూవీ కలెక్షన్స్ రోజు రోజుకు పెరగడానికి శ్రీ కళ్యాణరమణ సంగీతం ఎంతగానో హెల్ప్ అయ్యింది. ఈ మూవీలోని రొమాంటిక్ ట్రాక్ & ఎమోషనల్ సీన్స్ మరియు క్లైమాక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ మూవీ బయర్స్ అందరికీ పెట్టిన పెట్టుబడి వచ్చేయడంతో చాలా హ్యాపీగా ఉన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com