కామెడీ & రొమాంటిక్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ జో అచ్యుతానంద బిగ్ హిట్ అవుతుంది - రాజ‌మౌళి

  • IndiaGlitz, [Monday,August 22 2016]

నారా రోహిత్ - నాగ శౌర్య - రెజీనా కాంబినేష‌న్లో అవ‌స‌రాల శ్రీనివాస్ తెర‌కెక్కిస్తున్న చిత్రం జో అచ్యుతానంద‌. ఈ చిత్రాన్ని వారాహి చ‌ల‌న‌చిత్ర బ్యాన‌ర్ పై సాయి కొర్ర‌పాటి నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్నజో అచ్యుతానంద చిత్రానికి క‌ళ్యాణి మాలిక్ సంగీతం అందించారు. త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతున్న జో అచ్యుతానంద ఆడియో రిలీజ్ కార్య‌క్ర‌మం సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో ఘ‌నంగా జ‌రిగింది. రెగ్యుల‌ర్ గా కాకుండా వైవిధ్యంగా జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి ద‌ర్శ‌క‌ధీర రాజ‌మౌళి ముఖ్య అతిధిగా హాజ‌రై జో అచ్యుతానంద ధియేట్రిక‌ల్ ట్రైల‌ర్ ను రిలీజ్ చేయ‌గా, నిర్మాత సాయి కొర్ర‌పాటి ఆడియోను డిఫ‌రెంట్ గా పెన్ డ్రైవ్ లో రిలీజ్ చేయ‌డం విశేషం.

ఈ సంద‌ర్భంగా డైరెక్ట‌ర్ అవ‌స‌రాల శ్రీనివాస్ మాట్లాడుతూ....నేను సినిమా జ‌ర్నీ స్టార్ట్ చేసి 8 సంవ‌త్స‌రాలు అయ్యింది. నాని, ఇంద్ర‌గంటి మోహ‌న్ కృష్ణ‌, క‌ళ్యాణి మాలిక్, సాయి కొర్ర‌పాటి గారు న‌న్ను ఎంత‌గానో ప్రొత్స‌హించారు. ఈ న‌లుగురుకి థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను. ఈ సినిమా క‌థ‌ను ఫ‌స్ట్ రోహిత్ కి చెప్పాను. క‌థ విన్న వెంట‌నే ఓకే చెప్పారు. ఇక ఆనంద్ పాత్ర‌ గురించి చెప్పిన వెంట‌నే నాగ శౌర్య చేస్తాను అన్నారు. నారా రోహిత్, నాగ శౌర్య ఇద్ద‌రూ రియ‌ల్ లైఫ్ అన్న‌ద‌మ్ముల్లా చాలా చ‌క్క‌గా న‌టించారు. రెజీనా కూడా పాత్ర‌కు త‌గ్గ‌ట్టు చాలా చ‌క్క‌గా న‌టించింది. ఈ మూవీ టీజ‌ర్ బాగా వ‌చ్చేంది అంటే కార‌ణం క‌ళ్యాణి మాలిక్. ఊహాలు గుస‌గుస‌లాడే చిత్రాన్ని ఆద‌రించిన‌ట్టే ఈ చిత్రాన్ని కూడా ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నాను అన్నారు.

డైరెక్ట‌ర్ నందినీ రెడ్డి మాట్లాడుతూ...అవ‌స‌రాల శ్రీనివాస్ నాకు బాగా న‌చ్చిన డైరెక్ట‌ర్. ఊహ‌లు గుస‌గుస‌లాడే చిత్రాన్నిచాలా సార్లు చూశాను. క‌ళ్యాణి మాలిక్ సంగీతం అంటే చాలా ఇష్టం. నాగ శౌర్య తో వ‌ర్క్ చేయ‌డం బాగా ఎంజాయ్ చేస్తాను. రోహిత్ డిఫ‌రెంట్ ఫిల్మ్స్ చేస్తున్నాడు. సాయి గారు మ‌న‌మంతా అనే అద్భుత‌మైన చిత్రం ఇచ్చారు. డిఫ‌రెంట్ మూవీస్ అందించే సాయి గారు మ‌రిన్ని సినిమాలు చేయాలి అని కోరుకుంటున్నాను అన్నారు.

డైరెక్ట‌ర్ ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ మాట్లాడుతూ...2008 లో అవ‌స‌రాల శ్రీనివాస్ ను న్యూయార్క్ లో క‌లిసాను. త‌ను పంపించిన వీడియో నాకు బాగా న‌చ్చడంతో అష్టా చ‌మ్మాలో అవ‌కాశం ఇచ్చాను. అవ‌స‌రాల శ్రీనివాస్ తో ఇంట్రాక్ట్ అయిన కొద్ది రోజుల్లోనే మంచి ర‌చ‌యిత, ద‌ర్శ‌కుడు అవుతాడు అనిపించింది. ఈ సినిమా స్ర్కీన్ ప్లే చ‌దివాను. కొత్త క‌థ‌తో రూపొందిన సినిమా ఇది. చెప్ప‌డానికి చాలా క‌ష్టమైన క‌థ. రోహిత్ ప్ర‌యోగాత్మ‌క చిత్రాలు చేస్తున్నాడు. నాగ‌శౌర్య, రెజీనా త‌మ పాత్ర‌ల‌తో ఆడియోన్స్ ను బాగా ఆక‌ట్టుకుంటారు. ఈ చిత్రంలోని ఒక సీన్ కి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాను. క‌ళ్యాణ్ మాలిక్ తో నేను నాలుగు సినిమాలు చేసాను కానీ... అవ‌స‌రాల - క‌ళ్యాణి మాలిక్ ఇద్ద‌రికీ బాగా కుదిరింది అనిపిస్తుంది.వీళ్లిద్ద‌రూ క‌లిసి చేసిన సినిమాలో పాట‌లు బాగున్నాయి. ఆల్ ది బెస్ట్ టు జో అచ్యుతానంద టీమ్ అన్నారు.

హీరో నాని మాట్లాడుతూ...అవ‌స‌రాల శ్రీనివాస్ నా బెస్ట్ ఫ్రెండ్. ఇద్ద‌రం క‌లిసి అష్టా చ‌మ్మా సినిమాతో జ‌ర్నీ స్టార్ట్ చేసాం. అవ‌స‌రాల శ్రీనివాస్ కి ఉన్న‌ సెన్సాఫ్ హ్యూమ‌ర్ ఎవ‌రికీ ఉండ‌దు. ఈ సినిమా క‌థ నాకు చెప్పాడు. క‌థ వింటున్నంత సేపు న‌వ్వుతూనే ఉన్నాను. క్లైమాక్స్ వ‌చ్చేస‌రికి చాలా ఎమోష‌న్ అయిపోయాను. నా ఫేవ‌రేట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ క‌ళ్యాణి మాలిక్ గారు అందించిన‌ ఈ చిత్రంలోని పాట‌లు కూడా న‌చ్చాయి. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో నాకు తెలుసు కాబ‌ట్టి ముందుగానే టీమ్ కి కంగ్రాట్స్ అన్నారు.

కీర‌వాణి మాట్లాడుతూ...దేవిశ్రీప్ర‌సాద్ యు.ఎస్ లో చేస్తున్న ప్రొగ్రామ్ చూసాం. నాకు మంచి మిత్రుడు. దేవిశ్రీప్ర‌సాద్ స్టైల్ కి భిన్నంగా క‌ళ్యాణి మాలిక్ మ్యూజిక్ అందిస్తూ స‌క్సెస్ సాధిస్తున్నాడు. క‌ళ్యాణి మాలిక్ సంగీతం అందించిన జో అచ్యుతానంద ఆడియో, సినిమా గొప్ప హిట్ కావాలి. కొర్రపాటి సాయి గారి హృద‌యం చాలా మంచిది. ఆయ‌న ఓ 40 ఏళ్ల పాటు ఇలా సినిమాలు తీయాలి అన్నారు.

త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ మాట్లాడుతూ....ఈ చిత్రంలో భాస్క‌ర‌భ‌ట్ల రాసిన ఓ పాట నాకు బాగా న‌చ్చింది. వెంట‌నే ఫోన్ చేసి భాస్క‌ర‌భ‌ట్ల‌ను అభినందించాను. అలాగే తెలుగు సినిమా సంగీతాన్ని నిల‌బెడుతున్న క‌ళ్యాణి మాలిక్ ని అభినందిస్తున్నాను. అవ‌స‌రాల అద్భుత‌మైన మ‌నిషి. ఆయ‌న తీసిన ఈ చిత్రం విజ‌యం సాధించాలి అని కోరుకుంటున్నాను అన్నారు.

విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ మాట్లాడుతూ...ఇటీవ‌ల అనుకోకుండా సాయి గారి ఆఫీస్ కి వెళ్లాను. అక్క‌డ‌ అనుకోకుండా ఎడిటింగ్ రూమ్ కి వెళ్లి అనుకోకుండా ఓ సీన్ చూసాను. ఆ సీన్ ఈ సినిమా క్లైమాక్స్ సీన్ అని తెలిసింది. డ‌బ్బింగ్, రీ రికార్డింగ్ లేకుండా ఆ సీన్ చూసాను. అయినా ఆ సీన్ నా హృద‌యాన్ని క‌దిలించింది.ఈ చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ అన్నారు.

భాస్క‌ర‌భ‌ట్ల ర‌వికుమార్ మాట్లాడుతూ...రాజ‌మౌళి గారు ఉన్న స‌భ‌లో నేను ఉండ‌డం ఆనందంగా ఉంది. వేల్ రికార్డ్స్ & వారాహి బ్యాన‌ర్ అలాగే అవ‌స‌రాల‌తో వ‌ర్క్ చేయ‌డం ఫ‌స్ట్ టైమ్. క‌ళ్యాణిమాలిక్ సంగీతంలో అన్ని పాట‌లు రాయడం మ‌ర‌చిపోలేని అనుభూతి. మాస్ సాంగ్స్ & మెలోడి సాంగ్స్ రాసిన‌ప్ప‌టికీ నా కెరీర్ ఈ సినిమాతో స్టార్ట్ అయితే బాగున్ను అనిపిస్తుంది. నా మ‌న‌సుకి న‌చ్చిన‌ మంచి క‌విత్వం రాసే అవ‌కాశం ఇచ్చిన అవ‌స‌రాల‌కు థ్యాంక్స్. ఈ చిత్రంలో మాన‌వ సంబంధాల మీద రాసిన పాట అంద‌రికీ న‌చ్చుతుంది అని ఆశిస్తున్నాను అన్నారు.

రాజ‌మౌళి మాట్లాడుతూ...ఈ మూవీ ట్రైల‌ర్ చూస్తుంటే... కామెడీ & రొమాంటిక్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ అనిపిస్తుంది. ట్రైల‌ర్ చాలా బాగుంది. రెజీనా ఎక్స్ ప్రెష‌న్స్ బాగున్నాయి. రోహిత్ వాయిస్ బాగుంటుంది. నాగ‌శౌర్య అందంగా ఉంటాడు. వీళ్లిద్ద‌రు క‌లిసి న‌టించిన ఈ చిత్రం కూడా అంద‌రికీ న‌చ్చేలా ఉంటుంది అనుకుంటున్నాను. ట్రైల‌ర్ కి మార్కులు వేయాల్సివ‌స్తే...సంగీత ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ ర‌మ‌ణకే ఎక్కువ మార్కులు ఇస్తాను. ఎందుకంటే సంగీతం బాగుండ‌డం వ‌ల‌నే ట్రైల‌ర్ అంత బాగుంది అనిపిస్తుంది.

ఈ మూవీలోని పాట‌ల విష‌యానికి వ‌స్తే...ఇదేమి అల్ల‌రి అనే పాట న‌చ్చింది. రెండు మూడు నెల‌లు నా కారులో ఈ పాటే వింటాను. క‌ళ్యాణ ర‌మ‌ణ ఫాస్ట్ బీట్ సాంగ్స్ చేయ‌డు అంటారు. సువ‌ర్ణ సాంగ్ తో క‌ళ్యాణ ర‌మ‌ణ ఫాస్ట్ సాంగ్స్ కూడా చేస్తాడు అనే పేరు వ‌స్తుంది. నిర్మాత‌ సాయి గారు ప్ర‌తి సినిమాని డైరెక్ట‌ర్ పై న‌మ్మ‌కంతో తీస్తారు. డైరెక్ట‌ర్ పై అంత న‌మ్మ‌కం చూపించే నిర్మాత‌ను ఎప్పుడూ చూడ‌లేదు. జ్యో అచ్యుతానంద వెరీ వెరీ బిగ్ హిట్ అవుతుంది అన్నారు.

హీరో నాగ శౌర్య మాట్లాడుతూ...జో అచ్యుతానంద టైటిల్ వ‌లే ఈ సినిమా చేస్తూ నేను, రోహిత్ బాగా క‌లిసిపోయాం. రీమేక్ రైట్స్ కోసం బాలీవుడ్ లో అడుగుతున్నారు అని తెలిసింది. అన్న‌ద‌మ్ములుగా మ‌మ్మ‌ల్ని బీట్ చేయ‌డం ఎవ‌రి వ‌ల్ల కాదు. అవ‌స‌రాల నాకు లైఫ్ ఇచ్చిన వ్య‌క్తి. హిట్ అయినా ప్లాప్ అయినా నిర్మాత సాయి గారు ఒకేలా ఉంటారు. నేను కూడా అలాగే ఉండాల‌నుకుంటున్నాను. మా సినిమాకి మంచి సంగీతం అందించిన‌ క‌ళ్యాణ్ మాలిక్ గార్కి థ్యాంక్స్ అన్నారు.

నారా రోహిత్ మాట్లాడుతూ...అవ‌స‌రాల శ్రీనివాస్ నాకు మంచి అవ‌కాశం ఇచ్చినందుకు...అలాగే మంచి బ్ర‌ద‌ర్ నాగ‌శౌర్య‌ ని ఇచ్చినందుకు థ్యాంక్స్. ఒక మంచి క‌థ‌ సినిమాగా బ‌య‌ట‌కు రావాలంటే నిర్మాత కావాలి. హిట్ & ప్లాప్ అనేది చూడ‌కుండా సినిమాలు తీసే స‌త్తా ఉన్న ప్రొడ్యూస‌ర్ సాయి గారు. క‌ళ్యాణి మాలిక్ గారు సంగీతం అందించిన ఊహ‌లు గుస‌గుస‌లాడే చిత్రంలోని ఏం సందేహం లేదు...అనే సాంగ్ నాకు బాగా న‌చ్చిన సాంగ్. ఈ చిత్రానికి కూడా చాలా మంచి మ్యూజిక్ అందించారు. అన్న‌ద‌మ్ముల మ‌ధ్య అనుబంధాన్ని ఈ చిత్రంలో చాలా చ‌క్క‌గా చూపించారు. ఈ చిత్రం అంద‌రికీ న‌చ్చుతుంది అనుకుంటున్నాను అన్నారు.