దేశ చరిత్రలో ఫస్ట్ టైం..: ఎట్టకేలకు నిర్భయ నిందితులకు ఉరి
Send us your feedback to audioarticles@vaarta.com
దేశ రాజధాని ఢిల్లీలో పెను సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నిందితులకు ఎట్టకేలకు ఉరిశిక్ష అమలు అయ్యింది. ఎన్నో ట్విస్ట్‌లు.. మరెన్నో వాయిదాలు.. ఇంకెన్నీ పిటిషన్ల మధ్య ఎట్టకేలకు శుక్రవారం తెల్లారుజామున 4గంటలకు తీహార్ జైలులో ఉరిశిక్ష అమలు చేయడం జరిగింది. జైలు నంబర్-3లో పవన్, ముఖేష్, అక్షయ్, వినయ్‌కి ఉరి శిక్ష విధించారు. కాగా.. నలుగురు దోషులను ఒకేసారి తలారి పవన్ ఉరితీశాడు. ఉరి శిక్షకు ముందు వినయ్‌శర్మ భోరున విలపించాడు. దోషులు ఎక్కడికీ పారిపోకుండా.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒక్కొక్క దోషి వెంట 12 మంది గార్డులు ఉన్నారు. ఉరికంబం దగ్గర 48 మంది భద్రతా సిబ్బందిని పెట్టారు. ఉరిశిక్ష అమలుకాగానే తీహార్ జైలు బయట ప్రజలు సంబరాలు చేసుకున్నారు. నిర్భయకు న్యాయం జరిగిందంటూ జైలు ఎదుట పెద్దఎత్తున బ్యానర్లు ఏర్పాటు చేశారు. అంతకుముందు నిర్భయ నిందితులకు వైద్యపరీక్షలు పూర్తి చేసి.. నలుగురి ఆరోగ్యపరిస్థితి బాగుందని జైలు అధికారులు చెప్పడంతో అనంతరం నలుగురు దోషులకు అల్పాహారం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా తీహార్‌జైల్ లాక్‌డౌన్ చేశారు.
ఉరి అనంతరం నిర్భయ తల్లి మాటలివీ..
ఉరి శిక్ష అనంతరం నిర్భయ తల్లి ఆశాదేవి మీడియాతో మాట్లాడారు. ‘న్యాయం గెలిచింది. నా కూతురికి న్యాయం జరిగినందుకు సంతోషిస్తున్నాను.
ఆలస్యమైనా చివరికి న్యాయమే గెలిచింది. న్యాయ కోసం పోరాడిన లాయర్లకు కృతజ్ఞతలు. ఇలాంటి కేసుల్లో సత్వర న్యాయం కోసం పోరాడతాను. ఇప్పటికైనా చట్టాల్లోని లోపాలను సరిచేయాలి. నిర్భయ ఆత్మ శాంతిస్తుంది’ అని ఆశాదేవి ఒకింత భావోద్వేగంతో చెప్పారు.
చివరి వరకూ ప్రయత్నాలు..
న్యాయస్థానాల్లో ఆఖరి నిమిషం వరకూ నిర్భయ దోషులు ఎన్నెన్ని ప్రయత్నాలు యుపిరా ఫలించలేదు. దోషుల అన్ని పిటిషన్లను న్యాయస్థానాలు తిరస్కరించాయిజ. కాగా.. నిర్భయ ఘటన జరిగిన 8 ఏళ్లకు దోషులకు ఉరిశిక్ష అమలు కావడం జరిగింది. చివరి క్షణం వరకు ఉరి తప్పించుకునేందుకు దోషులు చేసిన ప్రయత్నాలన్నీ అట్టర్ ప్లాప్ అయ్యాయి. ఆఖరికి ఉరిశిక్షకు ముందు రోజు అర్థరాత్రి వరకు ఢిల్లీ హైకోర్టులో వాదనలు జరిగాయి. ఉరిపై స్టే ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరిచడంతో తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తెల్లవారుజాము వరకు సుప్రీంకోర్టులో వాదనలు
ఉదయం 3.30 గంటలకు ఉరిపై స్టే నిరాకరిస్తూ సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో జరగాల్సిందంతా జరిగిపోయింది.
మృతదేహాల అప్పగింత
కాగా.. నలుగురు నిందితులు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అరగంటపాటు ఉరికొయ్యలకు దోషులు వేలాడారు. పోస్ట్‌మార్టం కోసం మృతదేహాలను డీడీయూ ఆస్పత్రికి తరలించారు. ఉదయం 8 గంటలకే అంటే ఉరి వేసిన నాలుగు గంటల తర్వాత ఆ నాలుగు మృతదేహాలకు పోస్ట్‌మార్టంకు పంపడం జరిగింది. పోస్ట్‌మార్టం తర్వాత కుటుంబసభ్యులకు మృతదేహాలు అప్పగించనున్నారు. మరోవైపు నిందితుల కుటుంబీకులు ఇప్పటికే ఆస్పత్రికి చేరుకున్నారు.
దేశ చరిత్రలో ఫస్ట్ టైమ్..
కాగా.. దేశ చరిత్రలో నలుగురిని ఒకేసారి ఉరి తీయడం ఇదే మొదటిసారి. నిర్భయ ఘటన జరిగిన 8 ఏళ్లకు దోషులకు ఉరిశిక్ష అమలైంది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ ఘటనలో ఆఖరికి శుక్రవారం మార్చి-20న అమలయ్యింది.
పూర్వ పరాలు ఇలా..
2012 డిసెంబర్ 16న నిర్భయపై ఆరుగురు దుండగులు కదులుతున్న బస్సులో నిర్భయపై అత్యాచారం చేశారు. నిర్భయను క్రూరంగా హింసించి అత్యాచారం చేశారు. నిర్భయ స్నేహితుడిపైనా దోషుల దాడి, ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. పరిస్థితి విషమించడంతో సింగపూర్ ఆస్పత్రిలో నిర్భయకు చికిత్స అందించగా.. చికిత్స పొందుతూ 2012 డిసెంబర్ 29న సింగపూర్‌లో నిర్భయ మృతి చెందింది. 2012 డిసెంబర్ 17న ప్రధాన నిందితుడు రామ్‌సింగ్ అరెస్ట్ చేశారు. కొన్ని రోజుల తర్వాత మిగిలిన ఐదుగురు నిందితులు అరెస్ట్ చేయడం జరిగింది. 2013 మార్చి 11న తీహార్ జైలులో ప్రధాన నిందితుడు రామ్‌సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు. 2013 ఆగస్టు 31న మైనర్‌ను దోషిగా తేల్చిన జువైనల్ జస్టిస్ బోర్డు తీర్పునిచ్చింది. మైనర్‌ను మూడేళ్లపాటు జువైనల్ హోంకు జువైనల్ బోర్డు పంపింది. 2013న నలుగురు నిందితులకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఉరిశిక్ష విధించింది. 2014 మార్చి 13న నిర్భయదోషులకు ఉరిశిక్షను ఢిల్లీ హైకోర్టు సమర్థించిన విషయం తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com