YCP సోషల్ మీడియా పోరాటంతోనే కుమారి ఆంటీకి న్యాయం

  • IndiaGlitz, [Wednesday,January 31 2024]

ఇటీవల పాపులర్ అయిన కుమారి ఆంటీకి సీఎం రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. చిరు వ్యాపారులకు తమ ప్రభుత్వం భరోసాగా ఉంటుందని తెలిపారు. త్వరలోనే తాను స్వయంగా వచ్చి ఫుడ్ స్టాల్‌ను సందర్శిస్తానని చెప్పారు. దీంతో ఆమె ముఖంలో ఆనందభాష్ఫాలు కనిపించాయి. దీనికి తమ పార్టీ సోషల్ మీడియా పాత్ర ముఖ్య కారణమని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు.

జగనన్న ఇచ్చిన స్థలం మాత్రమే ఉంది..

ఏపీలోని గుడివాడకు చెందిన దాసరి సాయికుమారి తన భర్త పిల్లలతో కలిసి 2011లో హైదరాబాద్‌కు వలస వచ్చారు. ఫుట్ పాత్ మీద భోజనం అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. భర్త ఆటో డ్రైవర్ కాగా.. పిల్లలు చదువుకుంటున్నారు. అయితే తక్కువ ధరలో రుచికరమైన అందించడంతో కస్టమర్లు పెరుగుతూ వచ్చాయి. దీంతో ఆమె వ్యాపారం మూడు చేపలు, ఆరు రొయ్యలుగా సాగుతోంది. ఇదే సమయంలో కొన్ని యూట్యూబ్ ఛానళ్లు ఆమెను ఇంటర్వ్యూలు చేయడంతో సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు. అయితే ఓ ఇంటర్వ్యూలో తనకు ఆస్తిపాస్తులేమీ లేవని సీఎం వైయస్ జగన్ ఇచ్చిన ఇంటి స్థలం మాత్రమే ఉందని చెప్పుకొచ్చారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది.

చంద్రబాబు ఆదేశాలతోనే అంటూ..

ఇదిలా ఉంటే ఆమె జగన్ అభిమాని అని తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ యువనేత నారా లోకేష్ వెంటనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని పురమాయించి ఆ హోటల్‌కు నోటీసులు ఇచ్చి సీజ్ చేయడం క్షణాల్లో జరిగిపోయిందని వైసీపీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీంతో ఈ విషయం బాగా ట్రెండింగ్ అయిందని.. అందుకే రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించారని వైసీపీ కార్యకర్తలు చెబుతున్నారు. తమ పార్టీ సోషల్ మీడియా పోరాటంతోనే రేవంత్ రెడ్డి దిగొచ్చి కుమారి ఆంటీ హోటల్‌ను అక్కడే ఉంచాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారని పోస్టులు పెడుతున్నారు.

వైసీపీ సోషల్ మీడియా విజయం..

ఇది కచ్చతంగా తమ పార్టీ సోషల్ మీడియా విజయమని పేర్కొంటున్నారు. జగనన్న ఆర్మీ తలుచుకుంటే ఎవరైనా సరే దిగి రావాల్సిందేనని అభిప్రాయపడుతున్నారు ఏ దిక్కూ లేనివారికి మద్దతుగా నిలుస్తుందంటున్నారు. అదే సమయంలో టీడీపీ, జనసేన పార్టీలు మాత్రం జగనన్నకు అనుకూలంగా మాట్లాడేవారి ఫోటోలని, వీడియోలని మార్ఫింగ్ చేస్తూ రాక్షసానందం పొందుతున్నారని విమర్శిస్తున్నారు. ఇదే వైసీపీ సోషల్ మీడియాకి, టీడీపీ-జనసేన సోషల్ మీడియాకి తేడా అని వివరిస్తున్నారు.

More News

వాహనదారులకు గుడ్ న్యూస్.. చలాన్ల గడువు మరోసారి పెంపు..

రాయితీతో పెండింగ్ చలాన్లు చెల్లించని వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి శుభవార్త చెప్పింది. నేటితో ముగుస్తున్న గడువును ఫిబ్రవరి 15 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

Gyanvapi: జ్ఞానవాపి కేసులో కీలక పరిణామం.. మసీదులో పూజలు చేసుకునేందుకు కోర్టు అనుమతి..

జ్ఞానవాపి మసీదు వివాదం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. మసీదు ప్రాంగణలో సీల్ చేసి ఉన్న బేస్‌మెంట్‌లో పూజలు చేసుకునేందుకు వారణాసి కోర్టు అనుమతినిచ్చింది.

మద్యం మత్తులో కండక్టర్‌పై యువతి దాడి.. ఆర్టీసీ యాజమాన్యం ఆగ్రహం..

హైదరాబాద్‌లో ఓ యువతి ఆర్టీసీ బస్సులో హల్‌చల్ చేసింది. హయత్‌నగర్ బస్ డిపో-1కు చెందిన బస్సు హయత్ నగర్ నుంచి అప్జల్ గంజ్ బయల్దేరింది. హయత్‌నగర్ బస్టాప్‌లో ఓ యువతి మద్యం మత్తులో బస్సు ఎక్కింది.

AP DSC: నిరుద్యోగులకు సీఎం జగన్ శుభవార్త.. మెగా డీఎస్సీకి ఆమోదం..

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. గత ఐదేళ్లుగా నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

President Murmu: 500 ఏళ్ల నాటి అయోధ్య రామమందిరం కల నెరవేర్చాం: రాష్ట్రపతి

పార్లమెంట్‌లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) ప్రసంగించారు. కొత్తగా నిర్మించిన పార్లమెంట్‌లో ఇవే తొలి బడ్జెట్ సమావేశాలు కావడం విశేషం.