తెలంగాణలో నిన్న ఒక్కరోజే షాకింగ్ స్థాయిలో మద్యం అమ్మకం
Send us your feedback to audioarticles@vaarta.com
రాష్ట్రంలో లాక్డౌన్ ప్రకటన వెలువడిందో లేదో... మద్యం దుకాణాల వద్ద విపరీతమైన రద్దీ ఏర్పడింది. క్షణాల్లోనే మందుబాబులు మద్యం దుకాణాలకు క్యూ కట్టారు. ఒక్కొక్క షాపు వద్ద వందలాది మంది గుమిగూడారు. సంచులతో ప్రత్యక్షమై మరీ వేల రూపాయలు వెచ్చించి మద్యం కొనుగోలు చేశారు. తమ అవసరాలకు మించి మద్యాన్ని కొనుగోలు చేయడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం 10 రోజుల లాక్ ప్రకటించడంతో మందుబాబులు ఈ పది రోజులకు సరిపడా మద్యాన్ని తీసుకువెళ్లేందుకు మద్యం షాపుల ముందు బారులు తీరారు.
Also Read: 10 రోజుల పాటు రిజిస్ట్రేషన్లు బంద్
తెలంగాణలో మంగళవారం ఒక్కరోజే అది కూడా హాఫ్ డేలోనే ఎంత మద్యం సేల్ అయ్యిందో తెలిస్తే షాక్ అవక మానరు. లాక్ డౌన్ ప్రకటన నిన్న మధ్యాహ్నం 2 గంటల తర్వాత వెలుపడింది. క్షణాల్లో అంటే మూడు గంటల వరకు 56 కోట్ల రూపాయల విలువైన మద్యం డిపోల నుంచి దుకాణాలకు సరఫరా అయ్యింది. ఆ తరువాత పెద్ద మొత్తంలో అమ్మకాలు జరగాయి. సుమారు రూ.125 కోట్ల మద్యం నిన్న ఒక్కరోజేర అమ్ముడైంది. కాగా.. తెలంగాణలోని జిల్లాల్లో రంగారెడ్డిలోనే అత్యధికంగా మద్యం అమ్మకాలు జరిగాయి. మే నెలలో ఇప్పటి వరకు జరిగిన మద్యం అమ్మకాలు ఒక ఎత్తు అయితే.. నిన్న ఒక్కరోజు జరిగిన మద్యం అమ్మకాలు ఒక ఎత్తు కావడం గమనార్హం.
మే నెల 10 రోజుల్లో రూ.676 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. అంటే రోజుకు సుమారు రూ.61 కోట్ల మేరకు అమ్మకాలు జరిగాయి. అయితే మంగళవారం ఒక్కరోజే రెట్టింపు అమ్మకాలు జరిగాయని దుకాణదారులు వెల్లడించారు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో రూ.24 కోట్లకు పైగా అమ్మకాలు జరగా.. వరుసగా నల్గొండలో రూ.15.24 కోట్లు, ఖమ్మంలో రూ.12.25 కోట్లు, హైదరాబాద్లో రూ.10.17 కోట్ల విక్రయాలు జరిగాయి. రద్దీని బట్టి అదనంగా సరుకు తెప్పించుకున్నామని దుకాణదారులు తెలిపారు. మరోవైపు.. డిపోల్లోనూ అధికారులు, సిబ్బందిని అబ్కారీ శాఖ అప్రమత్తం చేసింది. ఇండెంటు పెట్టిన వెంటనే మద్యం చేరవేసేలా చర్యలు తీసుకున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com