సోషల్ మీడియా ట్రెండింగ్‌లో జస్టిస్ ఫర్ కామరాజ్ హ్యాష్ ట్యాగ్
Send us your feedback to audioarticles@vaarta.com
ఇటీవల జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్ తనపై దాడి చేసినట్టు పేర్కొంటూ బెంగళూరుకు చెందిన హితేషా చంద్రానీ అనే మహిళ ఓ వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. నిజానికి ఆ వీడియోలో హితేషా ముక్కుపై అడ్డంగా ఒక చిన్న సన్నని గాయం.. దాని నుంచి రక్తమోడటం కనిపించింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫుడ్ క్యాన్సిల్ చేసినందుకుగాను జొమాటో డెలివరీ బాయ్ తనపై ఎంతో దారుణంగా ప్రవర్తించి తనపై చేయి చేసుకున్నాడంటూ సదరు మహిళ వీడియోలో ఆరోపించింది. తొలుత వన్ సైడ్ వాదనను విన్న నెటిజన్లు హితేషాకు మద్దతుగా నిలిచారు.
డెలివరీ బాయ్ కామరాజ్‌పై ఈ విధంగా నేరారోపణ రావడంతో జొమాటో సంస్థ సైతం అతనిపై చర్యలు తీసుకుంది. అయితే అసలేం జరిగిందో వెల్లడిస్తూ కామరాజ్ సైతం ఓ వీడియోను విడుదల చేశాడు. ఆ వీడియో చూసిన నెటిజన్లు ప్రస్తుతం కామరాజ్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. నిజానికి డెలివరీ చేసేందుకు కాస్త లేటుగా వెళ్లిన మాట వాస్తవమేనని కానీ ఆ డెలివరీ తీసుకున్న అనంతరం డబ్బులు ఇవ్వనంటూ హితేషా దురుసుగా ప్రవర్తించిందని కామరాజ్ వెల్లడించాడు. చేసేదేమీ లేక తాను తిరిగి వస్తుండగా.. తనను ఇష్టానుసారంగా దూషించడం మొదలు పెట్టిందని చెప్పుకొచ్చాడు. ఇదేమని అడిగినందుకు తనపై చెప్పులతో దాడికి పాల్పడిందని ఈ క్రమంలోనే తన చేతి వేలికి ఉన్న ఉంగరం తన ముక్కుకు తగిలిందని.. వీడియో చూస్తే ఆ విషయం మీకే అర్థమవుతుందంటూ కామరాజ్ వీడియోలో వెల్లడించాడు.
కామరాజ్ వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దానిని చూసిన నెటిజన్లు అతని మాటల్లో నిజముందని నమ్ముతున్నారు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో# Justice For Kamaaraj.అనే హాష్ టాగ్ ట్రెండింగ్ లో ఉంది. అయితే తాజాగా ఈ అంశంపై తాజాగా బాలీవుడ్ హీరోయిన్ పరిణితి చోప్రా కూడా స్పందించింది. దయచేసి ఈ విషయంలో నిజానిజాలు తెలుసుకొని ప్రజల ముందు ఉంచండి అంటూ జొమాటో యాజమాన్య సంస్థను కోరింది. ‘‘ఒకవేళ అతను అమాయకుడు అయితే ఆ మహిళను శిక్షించండి ఈ ఘటన నిజంగా అమానవీయం, సిగ్గుచేటు, గుండె బరువెక్కిపోతుంది ఈ విషయంలో నేను ఏమైనా సహాయం చేయగలనేమో చెప్పండి” అంటూ పరిణితి చోప్రా ట్వీట్ చేసింది. ఈ వివాదంలో పోలీసులు కామరాజ్‌ను అరెస్ట్ చేయగా అతను గత గురువారం బెయిల్‌పై బయటకు వచ్చాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout