వర్మకు షాకిచ్చిన జూనియర్ పవన్ కల్యాణ్!

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల బయోపిక్‌లపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ బయోపిక్ తీస్తున్నానని ఒకసారి.. తాను తీస్తున్న పవర్ స్టార్ సినిమా బయోపిక్ కాదని.. పార్టీ ప్రారంభించి. ఎన్నికల్లో గోర పరాజయం పాలైన ఓ టాప్ సినీ స్టార్‌దని మరోసారి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అయితే తన సినిమా కేవలం కల్పితం అంటూనే అచ్చుగుద్దినట్టు పవన్‌లా ఉండే ఓ వ్యక్తితో ఓ వీడియో కూడా తీసి పవన్ సినిమా తీస్తున్నట్టు వెల్లడించారు.

పవన్ క్యారెక్టర్ కోసం వర్మ ఎంపిక చేసుకున్న వ్యక్తి పేరు చల్లకోటి నరేష్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణానికి చెందినవాడు. పవన్‌కు వీరాభిమాని అయిన నరేష్.. అచ్చం పవన్‌లా ఉండటంతో ఆయనను అనుకరిస్తూ ఎన్నో వీడియోలు తీసి టిక్‌టాక్‌లో పోస్ట్ చేసి ఫేమస్ అయ్యాడు. అయితే వర్మ నరేష్‌తో చర్చలు జరిపి తన సినిమాకు హీరోగా ప్రకటించారు. కానీ సడెన్‌గా వర్మకు నరేష్ షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏమైందో ఏమో కానీ ఈ సినిమా నుంచి నరేష్ డ్రాప్ అయినట్టు వార్తలు వస్తున్నాయి.