ఆర్ఆర్ఆర్ ఫ్లెక్సీ వివాదం : మెగా - నందమూరి ఫ్యాన్స్ మధ్య ఘర్షణ, ఎన్టీఆర్ అభిమాని ఆత్మహత్యాయత్నం
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు చిత్ర పరిశ్రమలోని పెద్ద కుటుంబాల్లో మెగా నందమూరి ఫ్యామిలీలు ప్రధానమైనవి. టాలీవుడ్ ను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన ఎన్టీఆర్ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసి తెలుగు దేశం పార్టీ స్థాపించారు. అప్పుడప్పుడే సుప్రీం హీరోగా గుర్తింపు తెచ్చుకుంటూ టాలీవుడ్ లో అగ్ర కథానాయకుడిగా ఎదిగే దిశగా అడుగులు వేస్తున్నారు చిరు. ఎన్టీఆర్ సీఎం కావడంతో.. తన నటవారసుడిగా బాలకృష్ణను రంగంలోకి దింపారు. తర్వాత సిల్వర్ స్క్రీన్ పై చిరు- బాలయ్యల మధ్య పోరు మొదలైంది. ఒకరి వెంట ఒకరు హిట్లు కొడుతూ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డారు.
ఇద్దరు రెండు బలమైన సామాజిక వర్గానికి చెందిన వాళ్లు కావడంతో ఈ పోరుకు కులం కూడా జత కలిసింది. స్కూళ్లు, కాలేజీలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో చొక్కాలు పట్టుకోవడం నుంచి భౌతిక దాడులు సైతం జరిగేవి. సినిమా రిలీజ్ నాడు థియేటర్ల వద్ద కటౌట్, బ్యానర్లు సైతం గొడవలకు దారి తీసేవి.
సినిమాల పరంగా కొట్లాడుకున్నప్పటికీ .. వ్యక్తిగతంగా ఇరు కుటుంబాల మధ్య మంచి సంబంధాలే వుండేవి. అదే సమయంలో తెలుగు నాట మల్టీస్టారర్ శకం మొదలవ్వడంతో అనేక మంది బడా హీరోలు ఈ తరహా సినిమాలు చేయడానికి ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే చిరు బాలయ్యలు కూడా సింగిల్ ఫ్రేమ్ లో కనిపిస్తారని ప్రచారం జరిగింది. కానీ ఇది ప్రచారమేనని తేలింది. అభిమానులు మాత్రం ఈ రెండు కుటుంబాల వారసులు కలిసి నటిస్తే చూడాలని ఆశపడ్డారు.
వీరి కోరికలు ఫలించి దర్శక ధీరుడు రాజమౌళి మెగా నందమూరి కుటుంబాల హీరోలతో సినిమా ప్లాన్ చేశారు. అదే ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్- రామ్చరణ్ కలిసి నటించిన ఈ సినిమా కోసం యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ వెయి కళ్లతో ఎదురుచూస్తోంది. మెగా నందమూరి అభిమానుల మధ్య సఖ్యత పెంచేందుకు కూడా ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని జక్కన్న తెరకెక్కించారన్న టాక్ కూడా వుంది. సినిమా రిలీజ్ దగ్గరపడటంతో ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేయడంలో తారక్, చరణ్ అభిమానులు తలమునకలై ఉన్నారు. ఈ నేపథ్యంలో కోదాడలోని ఓ థియేటర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. తారక్, చరణ్ అభిమానుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
తారక్ ఫ్లెక్సీ కడుతుండగా చరణ్ అభిమానులు అడ్డుకోవడంతో ఘర్షణ మొదలైందని చెపుతున్నారు. ఈ ఘర్షణలో తీవ్ర మనోవేదనకు గురైన ఎన్టీఆర్ అభిమాని ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తోటి వారు వెంటనే అప్రమత్తమై అతన్ని అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన థియేటర్ వద్దకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com