జూన్ లో నాగార్జున - రాఘవేంద్రరావుల హథీరామ్ బాబా..
Send us your feedback to audioarticles@vaarta.com
మనం, సోగ్గాడే చిన్ని నాయనా, ఊపిరి...చిత్రాలతో హ్యాట్రిక్ సాధించడంతో పాటు సరికొత్త రికార్డులు సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసారు టాలీవుడ్ కింగ్ నాగార్జున. ఈ మూడు చిత్రాలతో వరుసగా 40 కోట్లు షేర్ సాధించి... సరికొత్త రికార్డ్ సాధించి... నేటితరంలో తనకున్న క్రేజ్ ఏమిటో చెప్పకనే చెప్పారు నాటితరం హీరో నాగార్జున. ఈ సక్సెస్ ను ఇలాగే కంటిన్యూ చేసేలా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటున్న నాగ్ తదుపరి చిత్రాన్ని రాఘవేంద్రరావు దర్శకత్వంలో చేయనున్నారు.
తూర్పు గోదావరి జిల్లాలో నిర్మలా కాన్వెంట్ షూటింగ్ లో పాల్గొన్న నాగార్జున మాట్లాడుతూ... రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో చేయనున్న చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. హథీరామ్ బాబా జీవిత చరిత్రతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని జూన్ లో ప్రారంభించనున్నాం అని తెలియచేసారు. ఈ చిత్రానికి ఓం నమో వెంకటేశాయ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి పూర్తి వివరాలను త్వరలో తెలియచేయనున్నారు. మరి..నాగార్జున - రాఘవేంద్రరావుల కలయికలో రూపొందిన అధ్యాత్మిక అద్భుతాలు అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడి సాయి...చిత్రాల వలే హథీరామ్ బాబా చిత్రం కూడా అథ్యాత్మిక అధ్భుత చిత్రంగా నిలుస్తుందని ఆశిద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments