ఉషా మయూరి ద్వారా 'జూన్ 1:43' చిత్రం విడుదల

  • IndiaGlitz, [Friday,October 27 2017]

ఆదిత్య‌, రిచా హీరో హీరోయిన్లుగా ఆదిత్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై భాస్క‌ర్ బంటుప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో ల‌క్ష్మి నిర్మిస్తున్న చిత్రం 'జూన్ 1:43'.
శ్రవణ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా పాటలకు మంచి ఆదరణ లబిస్తోంది. ఇక నవంబర్ 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్బంగా
చిత్ర నిర్మాత ల‌క్ష్మి మాట్లాడుతూ - ఓ టీమ్ వర్క్ గా ఈ సినిమాను తెరకెక్కించాము. ఆద్యంతం ఉత్కంఠభరింతగా "జూన్ 1:43" ఉంటుంది.ఎన్నొ సూపర్ హిట్ సినిమాలను విడుదల చెసిన ఉషా మయూరి డిస్ట్రిబూషన్ వారు మా సినిమా చూసి నచ్చి నవంబర్ 10న విడుదల చెయనున్నారు.ముందుగా ఉషా మయూరి వారి నుంచి అప్లాజ్ రావటం,మా సినిమా సక్సెస్ పై మాకు మరింత కాన్పిడెన్స్ వచ్చిందన్నారు.

హీరో ఆదిత్య మాట్లాడుతూ .. "జూన్ 1:43" కధా బలమున్న చిత్రం. నా పాత్రను దర్శకుడు ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేశారు. నవంబర్ 10న ఆడియెన్స్ ముందుకు వస్తున్నాము. ప్రేక్షకాదరణ మా సినిమాకు లభిస్తుందన్న నమ్మకముందన్నారు..

ద‌ర్శ‌కుడు భాస్క‌ర్ బంటుప‌ల్లి మాట్లాడుతూ - "నిర్మాత అందించిన స‌పోర్ట్‌తోనే సినిమాను చేయ‌గ‌లిగాను. మా టీమ్ ఇష్ట‌ప‌డి చేయటంతో ఈ సినిమా ఔట్ పుట్ బాగా వ‌చ్చింది. మ‌ల్హ‌ర్‌భ‌ట్ జోషి సినిమాటోగ్ర‌ఫీ, శ్ర‌వ‌ణ్ సంగీతం సినిమాను నెక్ట్స్ రేంజ్‌లో నిలిపాయి". ఇక ఈ చిత్రాన్ని ఉషా మయూరి లాంటి పెద్ద సంస్ధ విడుదల చెయటం సంతోషమన్నారు.

ఆదిత్య‌, రిచా, వేణు, సాయి, బ‌న్ను, కాశీవిశ్వ‌నాథ్‌, మ‌ధుమ‌ణి, తోట‌ప‌ల్లి మ‌ధు,అరుణ్, కేధార్ శంక‌ర్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి ఎడిట‌ర్ః ఎస్‌.బి.ఉద్ధ‌వ్‌, కెమెరాః మ‌ల్హ‌ర్ భ‌ట్ జోషి, మ్యూజిక్ః శ్ర‌వ‌ణ్‌, నిర్మాతః ల‌క్ష్మి, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వంః భాస్క‌ర్ బంటు ప‌ల్లి.

More News

మేము పక్కా లోకల్ పోస్టర్ లాంచ్..

విక్రమ్ ఆర్ట్స్ సమర్పించు విఖ్యాత హరితవనం" మేము పక్కా లోకల్" దద్దరిల్లే జానపదం అనే క్యాప్షన్ తో 45 మంది బుల్లితెర  కళాకారులతో మొట్ట మొదటిసారిగా జానపద ఆట పాటల కార్యక్రమాన్ని జి.శ్రీనివాస్ రెడ్డి నిర్మాతగా విక్రమ్ ఆదిత్య రెడ్డి నిర్మాణంలో ఏర్పాటు చేస్తున్నారు.

సుమంత్ నూతన చిత్రం ప్రారంభం

వైవిధ్యమైన చిత్రాలను ఎంచుకుంటూ.. తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాందించుకున్న  హీరో అక్కినేని సుమంత్. ఆయన  హీరోగా నటిస్తున్న నూతన చిత్రం పూజా కార్యక్రమాలతో శుక్రవారం హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ దైవసన్నిధానంలో ప్రారంభమైంది.

నాగ శౌర్య కొత్త చిత్రం టైటిలిదే..

"ఊహ‌లు గుస‌గుస‌లాడే", "దిక్కులు చూడ‌కు రామ‌య్య‌", "ల‌క్ష్మిరావే మా ఇంటికి", "క‌ళ్యాణ‌వైభోగం"," జ్యోఅచ్చుతానంద‌" లాంటి విభిన్న క‌థాంశాల‌తో విజ‌యాలు సాధించి తెలుగు ప్రేక్ష‌కుల్లో ముఖ్యంగా ఫ్యామిలి ఆడియెన్స్‌లో ప్రత్యేక స్థానం సంపాయించాడు నాగ‌శౌర్య.

వెలుగులోకి మరో స్వామిజి రాసలీలల బాగోతం

బెంగుళూరు లో ఉన్న ఓ మఠంలో స్వామిజీ రాసలీలల వీడియో ఒకటి గురువారం వెలుగులోకి వచ్చింది.

ప్రముఖ నిర్మాత పివిపికి పితృ వియోగం

ప్రముఖ పారిశ్రామికవేత్త-నిర్మాత ప్రసాద్ వి.పొట్లూరి తండ్రి పొట్లూరి రాఘవేంద్రరావు (81) నేడు దివంగతులయ్యారు.