జులై చివరి వారం లో మరల తెలుపనా ప్రియా...

  • IndiaGlitz, [Monday,July 04 2016]

ప్రిన్స్‌, వ్యోమనంది, పూజా రామచంద్రన్‌ లు హీరో హీరోయిన్లుగా శ్రీ చైత్ర చలన చిత్ర నిర్మాణ సారథ్యంలో రూపొందుతోన్న చిత్రం 'మర‌ల తెలుపనా ప్రియా'. ఈ చిత్రం ద్వారా వాణి.యం.కొస‌రాజు ద‌ర్శ‌కురాలి గా ప‌రిచ‌యమ‌వుతున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ సినిమా పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుందంటూ చిత్ర యూనిట్ సోమవారం హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా...

మ్యూజిక్ దర్శకుడు శేఖర్ చంద్ర మాట్లాడుతూ ... మరల తెలుపనా ప్రియా పాటలను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. నా గత చిత్రాల పాటలను ఆదరించిన విధంగానే ఈ సినిమా పాటలను కూడా ఆదరించారు. డైరెక్టర్ గారు సినిమా కథను నెరేట్ చేసి ఆమెకు ఎలాంటి సంగీతం కావాలో దాన్ని రాబట్టుకున్నారు. ప్రతి సాంగ్ కు మంచి సాహిత్యం కుదిరింది. దర్శకురాలే ఓ పేథాస్ సాంగ్ ను రాశారు. ఆ సాంగ్ చాలా బాగా వచ్చింది. అన్నీ వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా ఇది. సినిమా సక్సెస్ అయితే ఆ క్రెడిట్ అంతా దర్శకురాలికే దక్కుతుంది.. అన్నారు.

దర్శకురాలు వాణి.యం.కొస‌రాజు మాట్లాడుతూ...ఇది స్వచ్చమైన ప్రేమకథ. శేఖర్ చంద్రగారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మంచి మ్యూజిక్ కావాలని ఆయన్ను చాలా ఇబ్బంది పెట్టాను. ఆయన చాలా ఓపికగా మంచి సంగీతాన్ని ఇచ్చారు. లిరిక్ రైటర్స్ చక్కని సాహిత్యాన్ని అందించారు. నేను కూడా ఓ పేథాస్ సాంగ్ రాశాను. ఓ విభిన్న‌మైన ప్రేమ‌క‌థా చిత్రం భిన్న‌మైన వ్య‌క్తిత్వాలు నేప‌ధ్యాలున్న అమ్మాయి, అబ్బాయిల మ‌ద్య సాగే ప్రేమ‌కథ. ఇప్పుడు అమ్మాయిలు కూడా ప్రేమ పేరుతో మోసాలు చేస్తున్నారు. స్త్రీ అయినా నాకే అది నచ్చలేదు. స్త్రీ, పురుషులెవరైనా ప్రేమ స్వచ్చంగానే ఉండాలి. ఈ విషయాన్ని నేను సినిమాగా చూపిస్తున్నాను. నెలాఖరున సినిమాను రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు... అన్నారు.

More News

'నాయకి' మళ్ళీ వెనక్కి వెళ్లుతుంది...?

చెన్నై సొగసరి,హీరోయిన్ త్రిష తెలుగు ప్రేక్షకులకి నాయకి త్రిష దశాబ్దానికి పైగా దక్షిణాది ప్రేక్షకులకు సుపరిచితమే.

మ‌హేష్ - విజ‌య్ ల‌తో 350 కోట్ల భారీ చిత్రం

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ - కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ల‌తో ఓ భారీ చిత్రాన్ని రూపొందించేందుకు డైరెక్ట‌ర్ సుంద‌ర్ సి ప్లాన్ చేస్తున్న‌ట్టు చెన్నై స‌మాచారం. సంగీత సంచ‌ల‌నం ఎ.ఆర్.రెహ‌మాన్, ప్రముఖ ఆర్ట్ డైరెక్ట‌ర్ సాబు సిరిల్, విజువల్ ఎఫెక్ట్స్ నిపుణుడు కమల్‌కణ్ణన్ తదితర హేమాహేమీలు ఈ చిత్రానికి వ‌ర్క్ చేయనున్నారు.

థ్యాంక్స్ చెప్పిన శ్రీమంతుడు..

సూప‌ర్ స్టార్ మ‌హేష్ - కొర‌టాల శివ కాంబినేష‌న్ లో రూపొందిన బ్లాక్ బ‌ష్ట‌ర్ శ్రీమంతుడు. ఈ చిత్రానికి గాను సైమా (సౌతిండియన్ ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీ అవార్డ్స్) 2016 సంవ‌త్స‌రానికి ఉత్త‌మ న‌టుడుగా మ‌హేష్ బాబు అవార్డు ద‌క్కించుకున్నారు.

క‌బాలి రిలీజ్ డేట్ ఫిక్స్..

సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ న‌టించిన లేటెస్ట్ సెన్సేష‌న్ క‌బాలి. ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్ట‌ర్ రంజిత్ తెర‌కెక్కించారు. క‌లై ఫులి ఎస్ థాను ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు.

పవన్ సినిమా ఆగిపోలేదు...నిర్మాత వివరణ...

సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రెండు సినిమాల్లో నటించడానికి సిద్ధమయ్యాడు. అందులో ఒక చిత్రం డాలీ దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మాతగా స్టార్ట్ అయ్యింది.