ఘనంగా 'జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్' ఆడియో విడుదల!!
Send us your feedback to audioarticles@vaarta.com
నవీన్ చంద్ర, నివేదా థామస్ జంటగా నటిస్తున్న చిత్రం 'జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్'. కొత్తపల్లి అనురాధ సమర్పణలో అనురాగ్ ప్రొడక్షన్స్ పతాకంపై కొత్తపల్లి ఆర్.రఘుబాబు, కె.బి.చౌదరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అజయ్ వోధిరాల దర్శకుడు. రతీస్ వేగ మ్యూజిక్ దర్శకత్వంలో రూపొందిన పాటల విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది.
ఈ కార్యక్రమంలో నవీన్‌చంద్ర తల్లి రాజేశ్వరి మొదటిసాంగ్‌ను విడుదల చేయగా, టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, కె.ఎల్.దామోదర్ ప్రసాద్, విజయ్ బండ్రెడ్డి, రామజోగయ్యశాస్త్రి, ఎస్తర్ తదితరులు పాల్గొన్నారు.
డైరెక్టర్ సుకుమార్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. బిగ్ సీడీని సుకుమార్ విడుదల చేశారు. ఆడియో సీడీలను డైరెక్టర్ సుకుమార్ విడుదల చేయగా హీరో నవీన్ చంద్ర తల్లి రాజేశ్వరి తొలి సీడీని అందుకున్నారు.
డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ.. "నేను సనత్‌నగర్‌లో ఉంటున్నప్పుడు, నా దగ్గరకు ఓ అబ్బాయి వచ్చి మీ దగ్గర నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా జాయిన్ కావాలనుకుంటున్నానని అన్నారు. నేనే డైరెక్టర్‌ను కాలేదు. నాకు నువ్వేంటి అసిస్టెంట్ డైరెక్టర్ అని నేను తనతో అన్నాను. అయితే మీరు తప్పకుండా డైరెక్టర్ అవుతారని ఆరోజు అన్నాడు. నేను డైరెక్టర్ అయిన తర్వాత నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా జాయిన్ అయ్యాడు. ఆ అబ్బాయే అజయ్ వోధిరాల. తను ప్రతి విషయాన్ని క్వాలిటీగా ఉండాలని అనుకుంటాడు.
తను నిర్మొహమాటంగా చెప్పేస్తాడు. మంచి టీంను వెతికి వెతికి తీసుకొచ్చి సినిమా చేశాడు. కథ విషయంలో కూడా ఎంతో టైమ్ తీసుకుని, మంచి కథతో చేసిన సినిమా ఇది. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. నవీన్‌చంద్ర మంచి పెర్ఫామెర్. మంచి మనసున్న వ్యక్తి. తనకు మంచి భవిష్యత్ ఉంటుంది. రఘుబాబుగారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చేసిన సినిమా ఇది. ఇలాంటి సినిమాలు హిట్ అయితేనే ఇండస్ట్రీ బావుంటుంది" అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ రతీస్ వేగ మాట్లాడుతూ.. "నా తొలి తెలుగు చిత్రం. తెలుగు ప్రేక్షకులు నన్ను, నా మ్యూజిక్‌ను ఆదరిస్తారని భావిస్తున్నాను" అన్నారు.
చిత్ర కథానాయకుడు నవీన్ చంద్ర మాట్లాడుతూ.. "మా డైరెక్టర్ అజయ్‌గారు చాలా మొండోడు. షాట్ బాగా వచ్చే వరకు వదలడు. మా నిర్మాతగారు సినిమా అంటే ప్యాషన్‌తో చేశారు. రతీస్ వేగ అద్భుతమైన పాటలను అందించారు. మూవీ కూడా తప్పకుండా అందరికీ నచ్చతుంది. నివేదాతో వర్క్ చేయడం ఆనందంగా ఉంది" అన్నారు.
నిర్మాత కొత్తపల్లి ఆర్.రఘుబాబు మాట్లాడుతూ.. సినిమా ప్రారంభం నుండి సుకుమార్‌గారు ఎంతో సహకారం అందిస్తున్నారు. దర్శకుడు అజయ్‌గారు క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను చక్కగా తెరకెక్కించారు. రతీస్ వేగగారు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. హీరో నవీన్ చంద్ర కథను నమ్మి, తొలి రోజు నుండి నేటి వరకు ఎంతో సపోర్ట్ చేశారు.
దర్శకుడు అజయ్ వోధిరాల మాట్లాడుతూ.. "నేను ఈ స్టేజ్‌కు రావడానికి కారణమైన నా కుటుంబ సభ్యులకు, సినిమా మేకింగ్‌లో సహకారం అందించిన అందరికీ థాంక్స్" అన్నారు.
నవీన్‌చంద్ర, నివేదా థామస్, అలీ, తాగుబోతు రమేష్, దేవన్, అభిమన్యుసింగ్, కాట్రాజ్, రోహిణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః అర్థర్ ఎ.విల్సన్, గిరీష్ గంగాధరన్, సంగీతంః రతీస్ వేగ, ఎడిటింగ్ః ఎస్.బి.ఉద్ధవ్, కళః రాజీవ్ నాయర్, ఫైట్స్ః రన్‌రవి, జాషువా, కథః రాజ్ శివ సధాని, మాటలుః కె.వేణుగోపాల్ రెడ్డి, శ్రీనాథ్ బదినేని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ః రవితేజ, లైన్ ప్రొడ్యూసర్ః సురేష్ కొండవీటి, నిర్మాతలుః కొత్తపల్లి ఆర్.రఘుబాబు, కె.బి.చౌదరి, దర్శకత్వంః అజయ్ వోధిరాల.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments