Chandrababu:స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్‌పై తీర్పు రిజర్వ్

  • IndiaGlitz, [Thursday,November 16 2023]

స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రెగ్యులర్ బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కౌంటర్ వాదనలు వినిపించారు. వాదనలు ముగియడంతో తీర్పును హైకోర్టు రిజర్వ్‌ చేసింది.

సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు వాదిస్తూ.. చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వొద్దు.. మెడికల్ రిపోర్టులు తప్పు.. స్కిల్ స్కాం కేసులో మూడు 10 రూపాయలు నోట్లు ఉపయోగించి హవాలా ద్వారా కోట్లు చేతులు మారాయి. ఈ డబ్బు చిన్నప్ప అనే వ్యక్తి ద్వారా హైదరాబాద్‌కు తరలించారు. బోస్ అనే వ్యక్తి ఫోన్ మెసేజ్‌ల ద్వారా ఈ విషయం బయట పడింది. బోస్, కన్వేల్కర్ మెసేజ్‌ల ఆధారంగా మొత్తం డబ్బు హైదరాబాద్ చేరినట్లుగా తెలిసింది. సీమెన్స్ కంపెనీలో కుంభకోణం జరిగిందని.. నిధుల మళ్లింపు జరిగిందని నిర్ధారించారు అని కోర్టులో తెలిపారు.

చంద్రబాబు తరఫున సిద్ధార్థ లూథ్రా వాదిస్తూ.. ఇప్పటికే చంద్రబాబు నాలుగు వారాల మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు. ఎన్నికలకు ముందు కావాలనే చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశారు. పోలీసులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని ప్రభుత్వ పెద్దలకు కాదు. అడ్వకేట్ ఎథిక్స్ విరుద్ధంగా డిల్లీలో ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి అసత్యాలు ప్రచారం చేశారు. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబును ఇరికించేందుకే ఫోరెన్సిక్ రిపోర్ట్ తయారు చేశారు. ఇప్పటికే చంద్రబాబు కంటికి శస్త్రచికిత్స జరిగింది.. ఇందుకోసం మరింత వైద్యం చేయించుకోవాల్సి ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు ఆయన గుండె సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు అందుకే రెగ్యులర్ బెయిల్ కోరుతున్నట్లు ఆయన తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు.

More News

Rahul Gandhi:రేపు తెలంగాణకు రాహుల్ గాంధీ.. ఒక్కరోజే ఐదు చోట్ల ప్రచారం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు రెండు వారాలు మాత్రమే సమయం ఉంది. దీంతో అన్ని పార్టీల నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

Congress:ప్రజాకర్షణగా కాంగ్రెస్ మేనిఫెస్టో.. పేదలపై వరాల జల్లు..

తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా ఈసారి ఎలాగైనా అధికారంలోకి కాంగ్రెస్ గట్టి పట్టుదలతో ఉంది. అందుకు తగ్గట్లే ప్రచారంలో దూసుకుపోతుంది.

KCR:కరెంట్ కావాలా? కాంగ్రెస్ కావాలా?.. ప్రజలకు కేసీఆర్ పిలుపు

కరెంట్ కావాలా? కాంగ్రెస్ కావాలా? రైతుబంధు కావాలా? రాబంధు కావాలా? సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.

Congress:కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకటనకు రంగం సిద్ధం.. ధరణి స్థానంలో భూభారతి..

తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా ఈసారి ఎలాగైనా అధికారంలోకి కాంగ్రెస్ గట్టి పట్టుదలతో ఉంది. అందుకు తగ్గట్లే ప్రచారంలో దూసుకుపోతుంది.

Jagan:జనమే జగన్ బలం.. జగనే జనం బలం..

ఆనాడు తండ్రిని చూడటానికి జనాలు తండోపతండాలుగా పోటెత్తేవారు.. ఈనాడు ఆయన కుమారుడిని కళ్లారా చూడటానికి ఉరకలేసే ఉత్సాహంతో పరిగెత్తుతున్నారు.