జూబ్లీహిల్స్ యాక్సిడెంట్ కేసులో ట్విస్ట్.. కారులో ఎమ్మెల్యే కుమారుడు, ధ్రువీకరించిన పోలీసులు

  • IndiaGlitz, [Sunday,March 20 2022]

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్విస్టులు మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. రెండేళ్ల చిన్నారి మరణానికి కారణమైన ఆ కారులో ఎమ్మెల్యే కుమారుడు కూడా ఉన్నాడని తొలి నుంచి అనుమానాలు వ్యక్తం అయ్యాయి. వీటిని బలపరుస్తూ శనివారం పోలీసులు కీలక ప్రకటన చేశారు. ప్రమాదానికి గురైన కారులో బోధన్ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ కూడా వున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఇద్దరు యువకులను అరెస్టు చేశారు పోలీసులు. వారిని సంతోష్ నగర్‌కు చెందిన అఫ్నాన్ మాజిద్‌లుగా తెలిపారు. అయితే ఈ కేసులో తన కుమారుడిని తప్పించేందుకు ఎమ్మెల్యే షకీల్ ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. కారు తన బంధువులదని, ఆ సమయంలో రాహిల్ అందులో లేడని ఇప్పటికే ఓ వీడియో విడుదల చేశారు షకీల్. ఇప్పుడు షకీల్ కుమారుడు కారులో ఉన్నట్లు పోలీసులు ధ్రువీకరించడంతో అసలు విషయం బయటపడింది. దీంతో పోలీసులు రాహిల్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

అయితే ఈ ప్రమాదం జరిగిన ప్రదేశంలో సీసీ కెమెరాల లేకపోవడంతో విచారణకు ఆటంకం కలుగుతోందని పోలీసులు చెబుతున్నారు. ఈ నెల 17వ తేదీ రాత్రి 7.30 గంటలకు యువకులు గచ్చిబౌలిలో మెక్‌డొనాల్డ్‌లోకి వెళ్లి, అక్కడ్నుంచి ఫిల్మ్‌నగర్‌ వైపు వెళ్లేందుకు కారులో బయలుదేరారు. ఈ క్రమంలో రాత్రి 8 గంటలకు జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబర్‌ 45 వద్ద డివైడర్ దాటుతున్న మహిళలను ఢీకొట్టారు. ముగ్గురు మహిళలను కారు ఢీకొట్టగా రెండున్నర నెలల వయసున్న చిన్నారి మృతిచెందింది. మగ్గురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతున్న ఈ మహిళలు, వారి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా అదృశ్యం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఒక్కసారిగా రాహిల్‌ను కేసులో నిందితుడిగా చేర్చడంతో కీలక మలుపు తిరిగినట్లయ్యింది.

More News

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూత

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, సీపీఎం వ్యవస్థాపక సభ్యురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూశారు.

తెలంగాణలో ‘ఆర్ఆర్ఆర్ ’ టికెట్ ధరల పెంపు.. ఏంతంటే..?

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ , రామ్‌చరణ్ కలిసి నటించిన ‘‘ఆర్ఆర్ఆర్’’ మూవీకి తెలంగాణ  సర్కార్ శుభవార్త చెప్పింది.

టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. ఉలిక్కిపడిన పార్టీ శ్రేణులు, స్పందించిన నారా లోకేష్

ఆధునిక యుగంలో అంత డిజిటల్‌గా మారిపోయిన తర్వాత సౌకర్యాలు పెరగడంతో పాటు నేరస్తుల సంఖ్య కూడా అనూహ్యంగా పెరిగింది.

రోడ్డు ప్రమాదంలో యూట్యూబర్ డాలీ మృతి, మాటలు రావడం లేదంటూ సురేఖవాణి పోస్ట్

శుక్రవారం రాత్రి గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యూట్యూబర్, నటి డాలీ కన్నుమూశారు. ఈ విషయాన్ని ప్రముఖ సినీ నటి సురేఖా వాణి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

కర్ణాటకలో ఘోర  రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది దుర్మరణం, చెల్లాచెదురుగా మృతదేహాలు

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం పాలవ్వగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.