JrNTR:తల్లిదండ్రులైన చరణ్ - ఉపాసన : వెల్కమ్ టూ పేరెంట్స్ క్లబ్.. అంటూ ఎన్టీఆర్ విషెస్
Send us your feedback to audioarticles@vaarta.com
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఈ రోజు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా చరణ్ జాన్ జిగ్రీ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా విషెస్ తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ‘‘ రామ్ చరణ్- ఉపాసన మీకు శుభాకాంక్షలు, పెరేంట్స్ క్లబ్‌లోకి మీకు స్వాగతం. పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడం సంతోషంగా వుందని, ఆడబిడ్డతో గడిపే ప్రత్యక్షణం తీయగా వుంటుందని.. ఆ దేవుడు బిడ్డను ఆశీర్వదిస్తాడని, ఆమె సంతోషంగా వుండాలని ’’ జూనియన్ ఎన్టీఆర్ ఆకాంక్షించారు.
ఆర్ఆర్ఆర్లో కలిసి నటించిన చరణ్ - ఎన్టీఆర్ :
కాగా.. తొలి నుంచి ప్రాణ స్నేహితులైన చరణ్, ఎన్టీఆర్‌లు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ‘‘ఆర్ఆర్ఆర్’’ సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. రికార్డుల దుమ్మ దులిపిన ఈ సినిమా ఏకంగా ఆస్కార్ అవార్డ్‌ను అందుకుని చరిత్ర సృష్టించింది. వాటిలో పాటు మరెన్నో అంతర్జాతీ పురస్కారాలను సైతం దక్కించుకుంది. ప్రస్తుతం రామ్ చరణ్ తమిళ దర్శక దిగ్గజం శంకర్ డైరెక్షన్లో గేమ్ ఛేంజర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తనకు పాప పుట్టిన నేఫథ్యంలో చరణ్ కొద్దిరోజులు షూటంగ్స్లకు దూరంగా వుండనున్నారు. అన్ని కార్యక్రమాలను వాయిదా వేసుకుని భార్యా బిడ్డతో సమయం గడపనున్నారు. ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే.. ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ‘‘దేవర’’లో నటిస్తున్నారు.
మనవరాలిని చూసేందుకు అపోలో ఆసుపత్రికి వెళ్లిన చిరు దంపతులు:
మనవరాలి రాకతో మెగాస్టార్ చిరంజీవి ఖుషీ అవుతున్నారు. ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన ‘‘ లిటిల్ మెగా ప్రిన్సెస్‌కు స్వాగతం.. నీ రాకతో మెగా ఫ్యామిలీతో పాటు కోట్లాది మందిలో ఆనందాన్ని నింపావు. చరణ్-ఉపాసనలను తల్లిదండ్రులుగా, మమ్మల్ని గ్రాండ్ పేరెంట్స్‌గా సంతోషించేలా చేశావు’’ అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు.. మనమరాలిని చూసేందుకు చిరంజీవి, సురేఖ దంపతులు అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు. వీరిద్దరితో పాటు మిగిలిన కుటుంబ సభ్యులు కూడా ఆసుపత్రికి వచ్చారు. అటు ఉపాసన కుటుంబ సభ్యులు కూడా అపోలోకి వచ్చినట్లుగా తెలుస్తోంది.
Congratulations @AlwaysRamCharan and @upasanakonidela. Welcome to the parents club. Every moment spent with the baby girl will be an unforgettable memory for a life time. May God bless her and you all with immense happiness.
— Jr NTR (@tarak9999) June 20, 2023
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout