JrNTR:తల్లిదండ్రులైన చరణ్ - ఉపాసన : వెల్‌కమ్ టూ పేరెంట్స్ క్లబ్.. అంటూ ఎన్టీఆర్ విషెస్

  • IndiaGlitz, [Tuesday,June 20 2023]

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఈ రోజు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా చరణ్ జాన్ ‌జిగ్రీ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా విషెస్ తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ‘‘ రామ్ చరణ్- ఉపాసన మీకు శుభాకాంక్షలు, పెరేంట్స్ క్లబ్‌లోకి మీకు స్వాగతం. పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడం సంతోషంగా వుందని, ఆడబిడ్డతో గడిపే ప్రత్యక్షణం తీయగా వుంటుందని.. ఆ దేవుడు బిడ్డను ఆశీర్వదిస్తాడని, ఆమె సంతోషంగా వుండాలని ’’ జూనియన్ ఎన్టీఆర్ ఆకాంక్షించారు.

ఆర్ఆర్ఆర్‌లో కలిసి నటించిన చరణ్ - ఎన్టీఆర్ :

కాగా.. తొలి నుంచి ప్రాణ స్నేహితులైన చరణ్, ఎన్టీఆర్‌‌లు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ‘‘ఆర్ఆర్ఆర్’’ సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. రికార్డుల దుమ్మ దులిపిన ఈ సినిమా ఏకంగా ఆస్కార్ అవార్డ్‌ను అందుకుని చరిత్ర సృష్టించింది. వాటిలో పాటు మరెన్నో అంతర్జాతీ పురస్కారాలను సైతం దక్కించుకుంది. ప్రస్తుతం రామ్ చరణ్ తమిళ దర్శక దిగ్గజం శంకర్ డైరెక్షన్‌లో గేమ్ ఛేంజర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తనకు పాప పుట్టిన నేఫథ్యంలో చరణ్ కొద్దిరోజులు షూటంగ్స్‌లకు దూరంగా వుండనున్నారు. అన్ని కార్యక్రమాలను వాయిదా వేసుకుని భార్యా బిడ్డతో సమయం గడపనున్నారు. ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే.. ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ‘‘దేవర’’లో నటిస్తున్నారు.

మనవరాలిని చూసేందుకు అపోలో ఆసుపత్రికి వెళ్లిన చిరు దంపతులు:

మనవరాలి రాకతో మెగాస్టార్ చిరంజీవి ఖుషీ అవుతున్నారు. ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన ‘‘ లిటిల్ మెగా ప్రిన్సెస్‌కు స్వాగతం.. నీ రాకతో మెగా ఫ్యామిలీతో పాటు కోట్లాది మందిలో ఆనందాన్ని నింపావు. చరణ్-ఉపాసనలను తల్లిదండ్రులుగా, మమ్మల్ని గ్రాండ్ పేరెంట్స్‌గా సంతోషించేలా చేశావు’’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు.. మనమరాలిని చూసేందుకు చిరంజీవి, సురేఖ దంపతులు అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు. వీరిద్దరితో పాటు మిగిలిన కుటుంబ సభ్యులు కూడా ఆసుపత్రికి వచ్చారు. అటు ఉపాసన కుటుంబ సభ్యులు కూడా అపోలోకి వచ్చినట్లుగా తెలుస్తోంది.

More News

Chiranjeevi:వెల్‌కమ్ లిటిల్ మెగా ప్రిన్సెస్ .. మనవరాలికి స్వాగతం పలికిన చిరు, ట్వీట్ వైరల్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఈ రోజు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.

Adinarayana Reddy:నేను ముందే ఊహించా .. పవన్‌కు ‘‘వై’’ కేటగిరీ భద్రత కల్పించాలి : ఆదినారాయణ రెడ్డి

తనకు ప్రాణహానీ వుందని, సుపారీ గ్యాంగ్‌లను రంగంలోకి దించారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు

Ram Charan, Upasana:మెగా ఫ్యామిలీలోకి అడుగుపెట్టిన శ్రీమహాలక్ష్మీ .. తల్లిదండ్రులైన చరణ్ - ఉపాసన

మెగా అభిమానులకు శుభవార్త. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు.

Soyam Bapurao:ఇంటికి, కొడుకు పెళ్లికి ఎంపీ లాడ్స్ డబ్బు వాడుకున్నా.. తప్పేంటీ : ఎంపీ బాపూరావు వ్యాఖ్యలు వైరల్

మనసులో ఏది దాచుకోకుండా తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే బీజేపీ నేత, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Dwarampudi Chandrasekhar Reddy:నేనేంటో అల్లు అరవింద్‌ని అడుగు .. నీ చిట్టా నా దగ్గరుంది, జాగ్రత్త : పవన్‌కు ద్వారంపూడి వార్నింగ్

తనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు వైసీపీ సీనియర్ నేత, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి.