ఎప్పుడూ నా పక్కనే వున్నందుకు థ్యాంక్స్.. చరణ్‌కు ఎన్టీఆర్ బర్త్ డే విషెస్
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ఇవాళ 38వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు . ఈ సందర్భంగా ఆయనకు కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు విషెస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్లో తన కోస్టార్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ .. చరణ్‌కు బర్త్‌డే విషెస్ తెలియజేశారు. వీరిద్దరి మధ్యా ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్షిప్ వుండగా.. ఆర్ఆర్ఆర్తో అది మరో మెట్టెక్కింది. వీరిద్దరి మైత్రి చూసి మెగా- నందమూరి అభిమానులు ముచ్చట పడుతున్నారు.
ఇక.. చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ‘‘నువ్వు ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి.. ఎప్పుడూ నా పక్కనే వున్నందుకు కృతజ్ఞతలు... మన స్నేహంలో మరిన్ని జ్ఞాపకాలను సృష్టించుకుందాం,’’ అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఈ మేరకు ఆర్ఆర్ఆర్ సెట్లో తాను చరణ్‌కు చొక్కా బొత్తలు పెడుతున్న ఫోటోను జూనియర్ షేర్ చేశారు.
మరోవైపు ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ల సందర్భంగా చరణ్, ఎన్టీఆర్ ఒకరిపై వున్న అభిమానాన్ని మరొకరు పంచుకున్నారు. ఇకపోతే.. ట్రిపుల్ ఆర్ మూవీ వసూళ్ల పరంగా రికార్డులు సృష్టిస్తోంది. తొలి రోజు 200 కోట్లకు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టి టాలీవుడ్ సత్తాను చాటింది. రానున్న రోజుల్లో ఇది మరింత పెరగనుంది.. దీనికి సంబంధించి ట్రేడ్ పండితులు పలు అంచనాలు వెలువరిస్తున్నారు.
Many happy returns brother @alwaysramcharan. Always grateful to have you by my side. Here's to making many more memories together. pic.twitter.com/1ma42XzdTt
— Jr NTR (@tarak9999) March 27, 2022
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com