చంద్రబాబుకు కరోనా.. ‘‘మావయ్య.. మీరు త్వరగా కోలుకోవాలి’’ : ఎన్టీఆర్ ట్వీట్
Send us your feedback to audioarticles@vaarta.com
దేశవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. సామాన్యులతో పాటు పలువురు ప్రముఖులు కూడా వైరస్ బారినపడుతున్నారు. తాజాగా తెలుగు దేశం పార్టీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు కోవిడ్ బారినపడ్డారు. స్వల్ప లక్షణాలతో తాను ఐసోలేషన్‌లో వున్నట్లు ఆయన స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇటీవలికాలంలో తనను కలిసినవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని, అవసరమైతే క్వారంటైన్‌లోకి వెళ్లాలని చంద్రబాబు సూచించారు. అందరూ అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు,
మరోవైపు చంద్రబాబుకి కరోనా సోకిందని తెలుసుకున్న అభిమానులు, సన్నిహితులు, కుటుంబసభ్యులు, పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి.. చంద్రబాబు,లోకేష్ త్వరగా కోలుకోవాలని ట్వీట్ వేయగా.. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా చంద్రబాబు త్వరగా కోలుకోవాలంటూ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు. అలానే లోకేష్ కూడా కోవిడ్ నుంచి బయటపడాలని జూనియర్ ఆకాంక్షించారు. ఎన్టీఆర్ గతంలో కరోనా బారినపడినప్పుడు చంద్రబాబు కూడా సోషల్ మీడియా వేదికగా త్వరగా కోలుకోవాలని పోస్ట్ పెట్టారు. మరోవైపు చంద్రబాబుకు కోవిడ్ సోకిన విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు.
Wishing you Mavayya @ncbn garu and @naralokesh a speedy recovery. Get well soon! https://t.co/cygw7hmARc
— Jr NTR (@tarak9999) January 18, 2022
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments