చంద్రబాబుకు కరోనా.. ‘‘మావయ్య.. మీరు త్వరగా కోలుకోవాలి’’ : ఎన్టీఆర్ ట్వీట్

దేశవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. సామాన్యులతో పాటు పలువురు ప్రముఖులు కూడా వైరస్ బారినపడుతున్నారు. తాజాగా తెలుగు దేశం పార్టీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు కోవిడ్ బారినపడ్డారు. స్వల్ప లక్షణాలతో తాను ఐసోలేషన్‌లో వున్నట్లు ఆయన స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇటీవలికాలంలో తనను కలిసినవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని, అవసరమైతే క్వారంటైన్‌లోకి వెళ్లాలని చంద్రబాబు సూచించారు. అందరూ అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు,

మరోవైపు చంద్రబాబుకి కరోనా సోకిందని తెలుసుకున్న అభిమానులు, సన్నిహితులు, కుటుంబసభ్యులు, పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి.. చంద్రబాబు,లోకేష్ త్వరగా కోలుకోవాలని ట్వీట్ వేయగా.. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా చంద్రబాబు త్వరగా కోలుకోవాలంటూ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు. అలానే లోకేష్ కూడా కోవిడ్ నుంచి బయటపడాలని జూనియర్ ఆకాంక్షించారు. ఎన్టీఆర్‌ గతంలో కరోనా బారినపడినప్పుడు చంద్రబాబు కూడా సోషల్ మీడియా వేదికగా త్వరగా కోలుకోవాలని పోస్ట్ పెట్టారు. మరోవైపు చంద్రబాబుకు కోవిడ్ సోకిన విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు.

More News

ఐదుగురు హీరోయిన్లు, ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లతో ‘‘రావణాసుర’’ పాలన ప్రారంభం

మాస్ మహారాజ్ వరుస సినిమాలతో హోరెత్తిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన చేతిలో నాలుగైదు సినిమాలు వున్నాయి.

కెరీర్ ను మలుపు తిప్పేలా "వర్మ"... వీడు తేడా- హీరో నట్టి క్రాంతి

న‌టుడిగా ర‌జ‌నీకాంత్‌ అంటే ఇష్టం. సినిమారంగంలో గురువులుగా డా. దాస‌రి నారాయ‌ణరావు, డా. డి. రామానాయుడు అయితే న‌ట‌న గురువుగా స‌త్యానంద్ గార‌ని

ఏపీలో నేటి నుంచే అమల్లోకి నైట్ కర్ఫ్యూ.. వారికి మాత్రం మినహాయింపు

కరోనా కేసులు మరోసారి పెరుగుతుండటంతో దేశంలోని అన్ని రాష్ట్రాలు మరోసారి ఆంక్షలను అమలు చేస్తున్నాయి.

తెలుగువారి ఫేవరేట్ 'చింతామణి' డ్రామాపై ఏపీ సర్కార్ నిషేధం.. ప్రదర్శిస్తే కఠిన చర్యలు

సినిమాలు, సీరియళ్లు రాకముందు తెలుగునాట ప్రజలకు వినోదం అందించింది నాటకాలే. వారాంతాలతో పాటు పండుగల వంటి ప్రత్యేక సందర్భాల్లోనూ నాటకాలు ఊరూవాడా రంజింపజేసేవి.

జీ 5 ఒరిజినల్ సిరీస్ 'లూజర్ 2' ప్రి రిలీజ్ ఈవెంట్... 21న సిరీస్ స్ట్రీమింగ్!

వినోదాత్మక సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు, డైరెక్ట్‌-టు-డిజిటల్‌ రిలీజ్‌లతో అన్ని భారతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీక్షకులకు వినోదాన్ని అందిస్తూ ‘జీ`5 ఓటీటీ’ అంటే ‘వినోదం మాత్రమే కాదు