జూనియర్ ఎన్టీఆర్ కుడి చేతికి గాయం.. సర్జరీ, ఏమైందంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు త్వరలో శస్త్రచికిత్స జరగనుంది. వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్- కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని పాత్ర కోసం మేకోవర్ అయ్యేందుకు ఆయన జిమ్‌లో వర్కవుట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ దాదాపు 6 నుంచి 7 కేజీల వరకు బరువు తగ్గే పనిలో ఉన్నారు.
ఈ సినిమాలో తారక్.. స్టూడెంట్ లీడర్‌గా కనిపించే సన్నివేశాలున్నాయి. అందుకోసం కాస్త సన్నబడాలని కొరటాల శివ.. ఎన్టీఆర్‌ను కోరినట్టు సమాచారం. ఈ క్రమంలోనే జిమ్‌లో వేలు విరగడంతో ఎన్టీఆర్ వైద్యులను సంప్రదించారు. ఈ సందర్భంగా ఒక చిన్నపాటి సర్జరీ చేయాలని వైద్యులు సూచించగా ఎన్టీఆర్ సర్జరీ చేయించుకున్నట్లు గా తెలుస్తోంది. అయితే ఈ విషయం ఎన్టీఆర్ స్వయంగా ప్రకటించ లేదు. దీపావళి సందర్భంగా తన కుమారులు భార్గవ్ రామ్, అభయ్ రామ్ ఇద్దరితో కలిసి ఉన్న ఎన్టీఆర్ ఫోటోలో ఆయన చేతికి బ్యాండేజి లాగా కనిపించడంతో అభిమానులు కంగారు పడ్డారు.
దీంతో ఆయన ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారట. మరో నెల రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఎన్టీఆర్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ‘‘ఆర్ఆర్ఆర్’’ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నాడు. కాగా.. తెలుగు చిత్ర సీమలో స్టార్ హీరోలు వరుసపెట్టి గాయాల బారినపడుతున్నారు. కొద్దిరోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి కుడి మణికట్టుకు సర్జరీగా జరగ్గా.. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ భుజం నొప్పితో సర్జరీ చేయించుకున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా సర్జరీ చేయించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com