జూనియర్ ఎన్టీఆర్ కుడి చేతికి గాయం.. సర్జరీ, ఏమైందంటే..?

  • IndiaGlitz, [Friday,November 05 2021]

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌‌కు త్వరలో శస్త్రచికిత్స జరగనుంది. వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్- కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని పాత్ర కోసం మేకోవర్ అయ్యేందుకు ఆయన జిమ్‌లో వర్కవుట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ దాదాపు 6 నుంచి 7 కేజీల వరకు బరువు తగ్గే పనిలో ఉన్నారు.

ఈ సినిమాలో తారక్.. స్టూడెంట్ లీడర్‌గా కనిపించే సన్నివేశాలున్నాయి. అందుకోసం కాస్త సన్నబడాలని కొరటాల శివ.. ఎన్టీఆర్‌ను కోరినట్టు సమాచారం. ఈ క్రమంలోనే జిమ్‌లో వేలు విరగడంతో ఎన్టీఆర్ వైద్యులను సంప్రదించారు. ఈ సందర్భంగా ఒక చిన్నపాటి సర్జరీ చేయాలని వైద్యులు సూచించగా ఎన్టీఆర్ సర్జరీ చేయించుకున్నట్లు గా తెలుస్తోంది. అయితే ఈ విషయం ఎన్టీఆర్ స్వయంగా ప్రకటించ లేదు. దీపావళి సందర్భంగా తన కుమారులు భార్గవ్ రామ్, అభయ్ రామ్ ఇద్దరితో కలిసి ఉన్న ఎన్టీఆర్ ఫోటోలో ఆయన చేతికి బ్యాండేజి లాగా కనిపించడంతో అభిమానులు కంగారు పడ్డారు.

దీంతో ఆయన ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారట. మరో నెల రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఎన్టీఆర్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ‘‘ఆర్ఆర్ఆర్’’ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నాడు. కాగా.. తెలుగు చిత్ర సీమలో స్టార్ హీరోలు వరుసపెట్టి గాయాల బారినపడుతున్నారు. కొద్దిరోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి కుడి మణికట్టుకు సర్జరీగా జరగ్గా.. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ భుజం నొప్పితో సర్జరీ చేయించుకున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా సర్జరీ చేయించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

More News

బిగ్‌బాస్ 5 తెలుగు: తగ్గేదేలే అన్న యానీ మాస్టర్, పింకీ.. సిరి ఏడుపుపై పింకీ సెటైర్లు, మానస్ ఫైర్

బిగ్‌బాస్ 5 తెలుగు హౌస్ మరోసారి రణరంగమైంది. కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా ఇంటి సభ్యుల మధ్య వివాదం చోటు చేసుకుంది. ప్రియాంకను అవతలి టీమ్ వాళ్లు ముప్పు తిప్పలు పెట్టారు.

హీరో రాజ‌శేఖ‌ర్‌ ఇంట్లో విషాదం.. ఆయన తండ్రి వరదరాజన్ గోపాలన్ కన్నుమూత

దీపావళి పండుగ వేళ సీనియర్ హీరో డా. రాజశేఖర్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి తండ్రి వరదరాజన్‌ గోపాల్‌ (93) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.

కె. విశ్వనాథ్ ఇంటికి చిరంజీవి దంపతులు.. ఆశీస్సులు తీసుకున్న మెగాస్టార్

దీపావళి పర్వదినం సెలబ్రిటీలు ఉత్సాహంగా గడుపుతున్నారు. తమ కొత్త సినిమాలకు సంబంధించిన పోస్టర్లు, ఫస్ట్ లుక్‌లు, సాంగ్స్, ప్రోమోలు, ట్రైలర్లు,

దీపావళి నాడు స్పెషల్ సర్‌ప్రైజ్.. ముగ్గురు హీరోయిన్ల గుట్టు విప్పిన నాని

నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘‘ శ్యామ్ సింగ రాయ్ ’’ సినిమా మీద టాలీవుడ్‌లో మంచి అంచనాలే ఉన్నాయి.

దీపావళి పండుగ సందర్భంగా రక్షిత్ అట్లూరి 'నరకాసుర' చిత్ర ఫస్ట్ లుక్ విడుదల

రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా నరకాసుర. ఈ చిత్ర నిర్మాణంలో భాగమవుతూ దర్శకత్వం