Jr Ntr : అప్‌డేట్స్ కోసం ఒత్తిడి తేవొద్దు.. ఏమైనా వుంటే భార్య కంటే ముందు మీకే చెబుతా : అభిమానులకు ఎన్టీఆర్ క్లాస్
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ యువ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్‌డేట్స్ కావాలంటూ దర్శక నిర్మాతల మీద ఒత్తిడి తీసుకురావొద్దని ఆయన అభిమానులను కోరారు. తన సోదరుడు నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా రాజేంద్రరెడ్డి తెరకెక్కించిన ‘అమిగోస్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన ఎన్టీఆర్ మాట్లాడుతూ .. తనకు ఆరోగ్యం బాగోకపోయినా ఈవెంట్‌కు వచ్చానని తెలిపారు. తమ కుటుంబంలో ఎంతోమంది నటులున్నా.. ప్రయోగాలు చేసేది అన్నయ్య ఒక్కరేనని ఎన్టీఆర్ ప్రశంసించారు. నటుడిగా, నిర్మాతగా తన సినిమాల్లో సాంకేతికతకు పెద్దపీట వేసింది ఆయనేనని అన్నారు. అమిగోస్ చిత్రం అన్నయ్య కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోతుందని ఎన్టీఆర్ ఆకాంక్షించారు.
నాకే కాదు అందరు హీరోలది ఇదే పరిస్ధితి :
సరిగ్గా ఇదే సమయంలో తన కొత్త చిత్రం అప్‌డేట్ ఇవ్వాలంటూ గోల చేయడంత ఎన్టీఆర్ స్పందించారు. తాము ప్రతిరోజూ, ప్రతి పూటా , ప్రతి గంటకూ అప్‌డేట్ ఇవ్వాలంటే చాలా కష్టమన్నారు. ఈ క్రమంలోనే దర్శక నిర్మాతల మీద ఒత్తిడి పెరుగుతోందని.. ఫ్యాన్స్ కోసమని ఏది పడితే అది చెప్పలేరని ఎన్టీఆర్ తెలిపారు. అప్‌డేట్ గనుక నచ్చకపోతే మళ్లీ ఫ్యాన్స్ నుంచి ట్రోలింగ్ ఎదురువుతోందన్నారు. ఇది తన విషయంలోనే కాకుండా మిగిలిన అందరూ హీరోలకూ జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇవ్వాల్సిన సమయంలో , అదిరిపోయే అప్‌డేట్ వుంటే ఇంట్లో భార్యల కంటే ముందు మీకే చెబుతామని ఎన్టీఆర్ స్పష్టం చేశారు. ఇక చివరిలో అభిమానుల కోరికను తీర్చారు ఎన్టీఆర్. ఈ నెలలోనే తన తదుపరి సినిమాను ప్రారంభిస్తున్నానని, మార్చి 20 లోపే షూటింగ్ మొదలుపెడతామని ఆయన తెలిపారు. 2024 ఏప్రిల్ 5న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని ఎన్టీఆర్ ప్రకటించారు.
రాజేంద్రకు సినిమా అంటే ఎంతో తపన:
ఇదే సమయంలో అమిగోస్ చిత్ర దర్శకుడు రాజేంద్ర రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు ఎన్టీఆర్. ఆయన ఇంజనీరింగ్ చదవి పరిశ్రమలోకి అడుగుపెట్టారని.. అయితే ఉద్యోగం చేసుకోకుండా ఈ సినిమాలేంటీ అని ఆయన తల్లిదండ్రులు అడిగారని తెలిపారు. అయితే రాజేంద్ర మాత్రం ఓ చిత్రానికి దర్శకత్వం వహించే ఇంటికి వస్తానని చెప్పారని.. కానీ ఈ సినిమా ప్రారంభమయ్యేలోపు తన తల్లిని, షూటింగ్ చివరి దశలో తండ్రిని కోల్పోయారని ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజేంద్రను చూస్తుంటే సినిమా పట్ల ఓ వ్యక్తికి ఇంత తపన వుంటుందని అని అనిపిస్తుందని యంగ్ టైగర్ కొనియాడారు. ఇక మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అధినేతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలిలను సైతం ఎన్టీఆర్ ఆకాశానికెత్తేశారు. 85 ఏళ్ల తెలుగు చిత్ర సీమలో ఒకే ప్రొడక్షన్ హౌస్ నుంచి రెండు సినిమాలు విడుదలై, రెండూ సూపర్‌హిట్ అందుకోవడం ఈ సంస్థకే సాధ్యమైందని జూనియర్ అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments