ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీస్‌లో జూనియర్ ఎన్టీఆర్ సందడి.. ఎందుకంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్(JR NTR) తాజాగా మెర్సిడేజ్ బెంజ్ కొత్త కారును కొన్నాడు. దీంతో ఈ కారు రిజిస్ట్రేషన్ కోసం ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్‌కి వచ్చాడు. బ్లాక్ టీ-షర్ట్‌లో, కాలింగ్ గ్లాస్సెస్‌తో స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ఆర్టీవో అధికారులతో మాట్లాడిన అనంతరం కారు ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సామాన్య వ్యక్తిలా వచ్చిన తారక్‌ను చూసి సిబ్బందితో పాటు ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే హైరేంజ్ మోడల్ కార్లు తారక్ గ్యారేజ్‌లో ఉన్నాయి.
ఇదిలా ఉంటే తారక్ సినిమాల విషయానికొస్తే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'దేవర' చిత్రం ఇటీవల గోవా షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఇక్కడ మూవీ షూటింగ్‌కి సంబంధించి ఓ వీడియో లీకై నెట్టింట హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ సముద్రంలో నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ వీడియోలో ఉంగరాల జుట్టుతో లుంగీ కట్టుకుని భుజంపై కండువా కప్పుకుని ఉన్నాడు. షూటింగ్ జరుగుతుండగా ఎవరో దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో తెగ వైరల్ అయింది.
ఇక ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా.. త్వరలోనే ఫస్ట్ సింగల్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు టాక్. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా ఫస్ట్ సింగిల్‌ని రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరికొన్ని రోజుల్లోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన పోసర్లు, గ్లింప్స్ వీడియో అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా కనిపించబోతున్నాడు. మరో సీనియర్ హీరో సంజయ్ దత్ కూడా ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారట. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరోవైపు ఈ మూవీలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నారట. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతోంది. అందులో మొదటి భాగం 'దేవర పార్ట్-1' దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments