పునీత్‌ను తలచుకున్న ఎన్టీఆర్.. ‘‘గెలయా గెలయా’’ పాడుతూ, ఇదే చివరిసారంటూ ఎమోషనల్
Send us your feedback to audioarticles@vaarta.com
కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణం నుంచి ఇంకా చిత్ర పరిశ్రమ, అభిమానులు, సన్నిహితులు కోలుకోలేదు. నిత్యం ఎక్కడో ఒక చోట ఆయన ప్రస్తావన వస్తూనే వుంది. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, వందల మంది ఆడపిల్లలకు ఉచిత విద్య అందించడంతో పాటు నటుడు, నిర్మాత, సింగర్, హోస్ట్‌గా పునీత్ వేసిన ముద్ర సాధారణమైనది కాదు. ఇక స్నేహానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు పునీత్ రాజ్‌కుమార్. అందుకే ఆయనకు శాండిల్‌వుడ్‌తో పాటు యావత్ భారతీయ సినీ రంగంలో మంచి ఫ్రెండ్స్ వున్నారు.
వీరందరిలోకి ఎన్టీఆర్‌తో అనుబంధం ప్రత్యేకమైనది. జూనియర్‌ను సొంత తమ్ముడిలా ఆయన భావిస్తారు. అందుకే పునీత్ కోసం ఆయన స్వయంగా కన్నడలో ‘గెలయా గెలయా’’ అంటూ పాట కూడా పాడారు. ఈ క్రమంలో పునీత్ హఠాన్మరణం జూనియర్ ఎన్టీఆర్‌ను షాక్‌కు గురిచేసింది. ఆయన భౌతికకాయం చూస్తూ ఎన్టీఆర్ ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నారు. తాజాగా పునీత్ రాజ్‌కుమార్‌ను మరోసారి గుర్తుచేసుకున్నారు యంగ్‌టైగర్.
ఆర్ఆర్ఆర్' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా టీమ్ మొత్తం ముంబై, బెంగుళూరు ప్రాంతాల్లో ప్రెస్ మీట్స్‌ను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా శుక్రవారం బెంగుళూరులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది చిత్ర టీమ్. ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి, అలియాభట్ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్‌కి పునీత్ రాజ్ కుమార్‌కి సంబంధించిన ప్రశ్న ఎదురైంది.
పునీత్ రాజ్‌కుమార్ బెంగుళూరులో ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని ఎన్టీఆర్ ఉద్వేగానికి గురయ్యారు. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని.. పునీత్ ఎక్కడున్నా.. ఆయన ఆశీస్సులు తమపై ఎప్పటికీ ఉంటాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగానే పునీత్ నటించిన 'చక్రవ్యూహ'లో తాను పాడిన 'గెలయా.. గెలయా..' అనే పాటను మరోసారి పాడి పునీత్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. అయితే ఇక ఎప్పటికీ ఈ పాట పాడనని, ఇదే చివరిసారి అంటూ ఎన్టీఆర్ వ్యాఖ్యానించడంతో అప్పు ఫ్యాన్స్ కూడా ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com