ప్రపంచంలోనే అతిపెద్ద ఐమ్యాక్స్‌ స్క్రీన్‌పై ‘సింహాద్రి’.. రీ రిలీజ్‌లోనూ సింగమలై సంచలనాలు

  • IndiaGlitz, [Monday,April 24 2023]

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘‘సింహాద్రి’’ సినిమా ప్రభంజనం అంతా ఇంతా కాదు. 20 ఏళ్ల క్రితం 2003 జూలై 9న రిలీజైన ఈ సినిమాలో ఎన్టీఆర్ పవర్ ఫుల్ యాక్టింగ్, పాటలు, భూమిక, అంకిత అందాలు, రాజమౌళి టేకింగ్‌కు ప్రేక్షకులు బ్రహ్మారథం పట్టారు. దాదాపు 52 సెంటర్స్‌లో 175 రోజులు ఆడి సంచలనం సృష్టించింది. రూ.8 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఆ రోజుల్లోనే రూ.40 కోట్ల వరకు వసూలు చేసి అప్పటి వరకు తెలుగు చిత్ర సీమలో వున్న అన్ని రికార్డులను బద్ధలు కొట్టింది.

ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా సింహాద్రి రీ రిలీజ్ :

ఇదిలావుండగా .. ప్రస్తుతం రీ రిలేజ్‌ల ట్రెండ్ మొదలైన నేపథ్యంలో స్టార్ హీరోల గత సినిమాలన్నీ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఖుషి , ఒక్కడు, వర్షం, ఆరెంజ్, చెన్నకేశవరెడ్డి వంటి సినిమాలు మరోసారి రిలీజై కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని సింహాద్రి సినిమాను కూడా రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ విషయంలోనూ జూనియర్ ఎన్టీఆర్ మరో రికార్డు సృష్టించాడు.

మెల్‌బోర్న్ ఐమ్యాక్స్‌ తెరపై సింహాద్రి :

ప్రపంచంలోనే అతిపెద్ద ఐమాక్స్ స్క్రీన్‌లో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఐమ్యాక్స్‌ ప్రపంచంలోనే అతిపెద్దది. ఈ షోకు సంబంధించి ఇప్పటికే బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఈ విషయాన్ని నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ప్రస్తుత జనరేషన్‌కి తగినట్లుగా సింహాద్రిని డాల్బీ అట్మాస్ ఆడియోతో 4కేలోకి మార్చారు. తెలుగు రాష్ట్రాల్లోనూ త్వరలో ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి. మరి రీ రిలీజ్‌లో సింహాద్రి ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తోందో చూడాలి.

More News

Devi Sri Prasad: బాస్‌తో బ్రేక్‌ఫాస్ట్ ... చిరంజీవి ఇంటికి దేవిశ్రీ ఎందుకెళ్లినట్లు..?

దేవి శ్రీ ప్రసాద్.. టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌. కొత్తగా ఎంతమంది వస్తున్నా.. ఇప్పటికీ టాప్ ప్లేస్ ఆయనదే. దాదాపు పాతికేళ్లుగా చిత్ర సీమకు సేవ చేస్తున్న దేవికి ఇప్పటికీ యువతలో

నాకు, నా కుటుంబానికి ప్రాణహానీ వుంది.. పోలీసులకు సింగర్ సునీత భర్త రామ్ ఫిర్యాదు

తనకు, తన కుటుంబానికి ఓ వ్యక్తి నుంచి ప్రాణహానీ వుందంటూ ప్రముఖ నేపథ్య గాయనీ సునీత భర్త రామ్ వీరపనేని పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్ రోడ్

Rahul Gandhi: ఎంపీగా అనర్హత వేటు.. ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసిన రాహుల్, లగేజ్ తీసుకుని ఎక్కడికి వెళ్లారంటే..?

లోక్‌సభ సభ్యుడిగా అనర్హత వేటు పడటంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రభుత్వం తనకు కేటాయించిన అధికారిక బంగ్లాను ఖాళీ చేశారు. ఢిల్లీలోని 12 తుగ్లక్ లేన్‌లో వుంటున్న

ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు : చీఫ్ గెస్ట్‌గా రజనీకాంత్... ఒకే వేదికపై తలైవా, చంద్రబాబు, బాలయ్య

పౌరాణికమైనా, సాంఘీకమైన, జానపదమైన తనదైన అద్భుతమైన నటనతో వెండితెర వేల్పుగా తెలుగు ప్రేక్షుకుల హృదయాల్లో సుస్ధిర స్ధానం సంపాదించుకున్నారు

శరత్‌బాబుకు అస్వస్థత.. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు తరలింపు, లేటెస్ట్ అప్‌డేట్ ఇదే

సీనియర్ నటుడు శరత్ బాబు కొద్దిరోజుల క్రితం అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న ఆయన ఆరోగ్యం కాస్త సీరియస్‌గా వుండటంతో బెంగళూరు