ఎన్టీఆర్.. వెంటనే టీడీపీ పగ్గాలు తీసుకో!!
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలైన తర్వాత ఎక్కువ సార్లు.. ఎవరి నోట విన్నా ‘ఎన్టీఆర్.. ఎన్టీఆర్’ అనే పేరే వినపడుతోంది. ఎన్నికల ఫలితాలు చూసిన తెలుగు రాష్ట్రాల టీడీపీ కార్యకర్తలు, అభిమానులు జూనియర్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. కొన్నాళ్ల నుంచి ఏపీ రాజకీయాలపై ట్వీట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్న టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ తాజాగా.. ఎన్టీఆర్ వ్యవహారంపై మరోసారి ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
" ఏపీ ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బ తిన్న తెలుగుదేశం పార్టీని జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే కాపాడగలరు. అప్పుడే ప్రజలు టీడీపీ అపజయాన్ని మరిచిపోతారు. అంతేకాదు... మునిగిపోతున్న టీడీపీని రక్షించగలిగే వ్యక్తి ఎవరైనా ఉంటే అది తారక్ ఒక్కడే. జూనియర్ ఎన్టీఆర్‌కు తాత ఎన్టీఆర్‌పై ఏ మాత్రం అభిమానం ఉన్నా.. వెంటనే టీడీపీని రక్షించే బాధ్యతల్ని భుజాలపై వేసుకోవాలి" అని ఆర్జీవీ సూచించారు.
కాగా.. ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ అంటూ... 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా తీసి టీడీపీలో అలజడి సృష్టించిన ఆర్జీవీ.. తాజాగా ఈ వ్యాఖ్యలతో మరో హాట్ టాపిక్ అయ్యారు. ఆర్జీవీ ట్వీట్స్‌పై టీడీపీలో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాయో.. తెలుగు తమ్ముళ్లు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి. అంతేకాదు తారక్‌కే ఏకంగా ట్యాగ్ చేస్తూ ఆర్జీవీ ఈ ట్వీట్స్ చేశారు. అయితే ఎన్టీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో.. లేకుంటే రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదని లైట్ తీసుకుంటారో వేచి చూడాలి మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com