'ఆట కాదు వేట' అంటూ దుమ్ములేపిన ఎన్టీఆర్!
- IndiaGlitz, [Saturday,July 06 2019]
ఇదేదో సినిమాలో డైలాగ్ కాదులెండి.. ఐపీఎల్ స్ఫూర్తితో మొదలైన ప్రో కబడ్డీ దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. జులై-20 నుంచి ఈ టోర్నమెంట్ తదుపురి సీజన్ ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ ‘స్టార్ మా’, ‘హాట్ స్టార్’లో ప్రసారం కానుంది. ఇందుకుగాను ఓ వీడియోను సంబంధిత యాజమాన్యం రిలీజ్ చేసింది.
ఈ వీడియోలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ దుమ్ముదులిపి వదులుతున్నాడు. ‘కబడ్డీ ఆట కాదు వేట’ అంటూ తనదైన స్టైల్‌లో పంచ్‌ల వర్షం కురిపించారు. సో.. ఈ సారి ప్రో కబడ్డీకి జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేస్తున్నారని దాదాపు మీకు అర్థమైపోయి ఉంటుంది. కాగా.. ఎన్టీఆర్ తెలుగు సీజన్‌కు ఇలా ప్రచారకర్తగా వ్యవహరించడం ఇది రెండోసారి. ఎన్టీఆర్ ఉన్న ఈ వీడియోను ఇప్పటికే 47.8K అభిమానులు వీక్షించగా పెద్ద ఎత్తున కామెంట్స్, షేర్‌ల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు అభిమానులు పెద్ద ఎత్తున ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
కాగా.. దర్శకధీరుడు జక్కనతో తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది.