కాలేజ్, లవ్ బ్యాక్‌డ్రాప్‌లో రౌడీ బాయ్స్.. ఆకట్టుకుంటున్న ట్రైలర్
Send us your feedback to audioarticles@vaarta.com
ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ వంటి పెద్ద సినిమాల విడుదలు వాయిదా పడటంతో ఈ సంక్రాంతికి అన్నీ చిన్న సినిమాలే హల్ చల్ చేయబోతున్నాయి. దాదాపు అరడజనుకు పైగా చిన్న సినిమాలు , వీటికి అదనంగా డబ్బింగ్ మూవీలు ప్రేక్షకులకు వినోదాన్ని అందించనున్నాయి. అందులో 'రౌడీ బాయ్స్' మూవీ కూడా ఒకటి. జనవరి 14న ఈ చిత్రం విడుదల కాబోతుంది. దిల్ రాజు సోదరుడు శిరీష్ కొడుకు అయిన ఆశీష్ ఈ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, టైటిల్ సాంగ్‌కి మంచి స్పందన వచ్చింది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఈ క్రమంలో శనివారం యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతులు మీదుగా ‘‘రౌడీ బాయ్స్’’ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
స్ట్రిక్ట్ ఫాదర్ కంట్రోల్‌లో పెరిగిన ఓ కుర్రాడు(ఆశీష్) ఇంజినీరింగ్ కాలేజ్‌లో చేరడం... తన కంటే రెండేళ్ళు పెద్దదైన మెడికల్ స్టూడెంట్ (అనుపమ పరమేశ్వరన్) తో ప్రేమలో పడటం.. ఆ తర్వాత వాళ్ళు ఎదుర్కొన్న సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కినట్టు తెలుస్తోంది. లవ్‌ట్రాక్‌కు తోడు కాలేజ్ వాతావరణం, రెండు స్టూడెంట్ గ్రూప్ లు.. వాటి మధ్య గొడవలు వంటివి కూడా ఈ ట్రైలర్లో కనిపించాయి. 'హుషారు' ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి రౌడీ బాయ్స్‌కి దర్శకుడు. ఆశీష్, అనుపమల మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే కుదిరింది. వీరి మధ్య ఓ లిప్ లాక్ కూడా ఉంది. ఎప్పటిలాగే రాకింగ్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మంచి సంగీతం అందించాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments