జూనియర్ ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ ప్రార్థనలు

  • IndiaGlitz, [Wednesday,April 24 2019]

డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డాడు ... ? అనే వార్త సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పుడు వైరల్ అయ్యాయి. ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఎదుట చేతికి కట్టుతో నిల్చున్న ఫొటోస్ చూసిన అభిమానులు బాధ పడుతున్నారు. తారక్ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు కూడా చేస్తున్నారు. అయితే గాయం ఎలా అయింది... ఎప్పుడు ఈ ఘటన జరిగిందనే విషయాలు మాత్రం ఇంకా తెలియ రాలేదు.

ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్న రామ్ చరణ్ తేజ్ కూడా ఇంతకు ముందు షూటింగ్ లో గాయపడగా.... డాక్టర్ సలహాతో రెస్ట్ తీసుకుంటున్నాడు.కాగా.... బాహుబలి ని మించిన అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. చెర్రీ అల్లూరి సీతారామరాజు గా... తారక్ కొమురం భీం గా కనిపించనున్న ఈ సినిమా లో .... చెర్రీకి జోడీగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటించనుంది. 2020 జూలై 30 న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు చిత్ర యూనిట్.