ఎన్టీఆర్ మామ నార్నె పోటీ ఇక్కడ్నుంచే..!?
Send us your feedback to audioarticles@vaarta.com
జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు 2019 ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా..? ప్రకాశం జిల్లా అద్దంకి అసెంబ్లీ టికెట్ ఆయనకు ఫిక్స్ అయ్యిందా..? గుంటూరు ఎంపీ టికెట్ అడిగిన ఆయనకు కుదరదన్న అధిష్టానం అద్దంకి అసెంబ్లీ టికెట్ కన్ఫామ్ చేసిందా..? 2014 ఎన్నికల్లో వైసీపీ బీఫామ్‌తో గెలిచి పార్టీ ఫిరాయించిన గొట్టిపాటి రవికుమార్‌తో ఎన్టీఆర్ మామ ఢీ కొనబోతున్నారా..? అంటే తాజా రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే అవుననే సమాధానాలు వస్తున్నాయి.
ఏపీ సీఎం చంద్రబాబు దగ్గరి బంధువు, టాలీవుడ్ టాప్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మామ(లక్ష్మీ ప్రణతి తండ్రి) నార్నె శ్రీనివాసరావు ఇటీవల వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సమక్షంలో కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. వైఎస్ జగన్‌ను సీఎం చేయడానికే తాను వైసీపీ తీర్థం పుచ్చుకున్నానని పార్టీలో చేరినట్లు నార్నె చెప్పారు. అయితే అంతకముందే జరిగిన భేటీలోనే ఆయన గుంటూరు ఎంపీ టికెట్ తాను ఆశిస్తున్నానని.. కచ్చితంగా గెలిచి తమరికి గిఫ్ట్‌గా ఇస్తానని జగన్‌తో నార్నె చెప్పారట. అయితే లండన్ పర్యటన నుంచి రాగానే ఈ విషయమై చర్చిస్తానన్న జగన్.. తిరిగిరాగానే నార్నె వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో సరైన అభ్యర్థి లేకపోవడంతో నార్నెను అక్కడ్నుంచి పోటీ చేయించాలని భావించి టికెట్ ఫిక్స్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
మొత్తానికి చూస్తే.. గొట్టిపాటిని ఢీకొట్టి ఓడించడానికి ఆర్థికంగా, రాజకీయంగా.. ప్రభావితం చేసే నార్నెను జగన్ గట్టిగానే ప్లాన్ చేశారన్నమాట. ఇదిలా ఉంటే అద్దంకి పక్కనే పర్చూరు నియోజకవర్గం ఉండటంతో అన్ని వ్యవహారాలు తానే చూసుకుంటానని దగ్గుబాటి వెంకటేశ్వరరావు జగన్‌కు మాటిచ్చారట. మరోవైపు ఎలాగో గొట్టిపాటిని ఆర్థికంగా, ముఖ్యంగా సామాజిక వర్గం పరంగా ఎదుర్కొనే సత్తా నార్నెకు ఉండటంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కాగా ఇప్పటికే టీడీపీ తరఫున అద్దంకి నుంచి గొట్టిపాటి పోటీ చేస్తారని తేలిపోయింది. ఈ తరుణంలో మామ తరఫున జూనియర్ ప్రచారం చేస్తారా..? లేకుంటే తెలుగుదేశం తరఫున ప్రచారం చేస్తారా..? లేకుంటే అటు ఇటు కాకుండా ఎన్నికల పంచాయితీనే పట్టించుకోకుండా మిన్నకుండిపోతారా..? అన్నది తెలియాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments