Jr Ntr Fan:ఎన్టీఆర్ వీరాభిమాని మృతిపై మిస్టరీ : జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోన్న ఫ్యాన్స్ , ట్రెండింగ్‌లో #WeWantJusticeForShyamNTR

  • IndiaGlitz, [Tuesday,June 27 2023]

యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌కు ప్రాంతాలు, కుల, మతాలకు అతీతంగా కోట్లాది మంది అభిమానులు వున్నారు. ఇలాంటి వారిలో శ్యామ్ ఒకరు. విశ్వక్ సేన్ ధమ్కీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఇతను లైమ్ లైట్‌లోకి వచ్చాడు. ఈ వేడుకకు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఆ సమయంలో ఎన్టీఆర్‌తో చేయి కలపాలని , ఫోటో దిగాలని వేదికపైకి వచ్చిన శ్యామ్‌ను భద్రతా సిబ్బంది పక్కకు నెట్టివేశారు. అయితే ఎన్టీఆర్ స్వయంగా అతనిని వేదికపైకి పిలిచి ఫోటో దిగి ఆ కుర్రాడికి సంతోషం కలిగించారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాంటి శ్యామ్ అనుమానాస్పద స్థితిలో మరణించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. అతను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఫోటోలు బయటకు వచ్చాయి. కానీ శ్యామ్ కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఎన్టీఆర్ అభిమానులు మాత్రం అతని మరణం వెనుక ఏదో మిస్టరీ వుందని అనుమానిస్తున్నారు.

ఆత్మహత్య కాదంటోన్న ఫ్యాన్స్ :

తూర్పుగోదావరి జిల్లా కొప్పిగుంట గ్రామానికి చెందిన శ్యామ్.. చింతలూరులో చనిపోయాడు. దీంతో అతని మరణంపై వైఎస్ జగన్ ప్రభుత్వం వెంటనే దర్యాప్తు చేసి, శ్యామ్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. శ్యామ్ ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక ఎవరైనా అతనిని చంపి , ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారా అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. దీనికి వారు చూపుతున్న కారణాలు కూడా బలంగా వున్నాయి.

శోకసంద్రంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ :

‘‘ ఉరి వేసుకున్న వ్యక్తి కాళ్లు నేలకు తాకి ఎలా వుంటాయి... ? శరీరం మీద మరియు ముక్కు మీద గాయాలు ఎందుకు వుంటాయి..? జేబులో గంజాయి ప్యాకెట్లు వుంటే ఆ మత్తులో ఉరి ఎలా వేసుకుంటాడు..? హ్యాండ్ కట్ చేసుకుంటే అంత నిలకడగా ఎలా ఉరి వేసుకుంటాడు..? ’’ అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే శ్యామ్ మరణంపై దర్యాప్తు చేయాలని వారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కోరుతున్నారు. ఈ మేరకు ‘‘ #WeWantJusticeForShyamNTR ’’ అనే హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతోంది. అంతేకాదు.. ఇండియా ట్విట్టర్ ట్రెండ్స్‌లో అది టాప్‌లో కొనసాగుతోంది. మరోవైపు శ్యామ్ మరణవార్తతో ఎన్టీఆర్ అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అతనికి సోషల్ మీడియా ద్వారా నివాళుర్పిస్తూ వుండగా.. కొందరు ఫ్లెక్సీలు, బ్యానర్లు పెట్టి శ్యామ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నారు.

More News

KTR:కేసీఆర్‌తో పెట్టుకున్న వారెవరూ బాగుపడలేదు.. జేపీ నడ్డాకు కేటీఆర్ స్టైల్ వార్నింగ్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పెట్టుకున్న ఏ ఒక్కరూ బాగుపడలేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,

Owaisi:మా వాళ్లనే అరెస్ట్ చేస్తారా, బోధన్‌లో బీఆర్ఎస్‌ను ఓడిస్తాం .. మరిన్ని స్థానాల్లోనూ బరిలోకి ఎంఐఎం: ఒవైసీ

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు .. ఆయనకు మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Delhi:ఢిల్లీలో సినీ ఫక్కీలో చోరీ : గన్‌తో బెదిరించి, కారును అడ్డగించి .. రూ. లక్షలు చోరీ .. వీడియో వైరల్

కట్టుదిట్టమైన భద్రత, అడుగడుగునా సాయుధ బలగాలు సంచరించే దేశ రాజధాని ఢిల్లీలో నేరాలు నానాటికీ పెరుగుతున్నాయి.

YS Jagan: వైఎస్సార్ లా నేస్తం నిధులు విడుదల.. ఇలాంటి పథకం మరో రాష్ట్రంలో లేదు : వైఎస్ జగన్

2023–24 సంవత్సరానికి మొదటి విడత ‘వైఎస్ఆర్ లా నేస్తం’ ఆర్థిక ప్రోత్సాహకాన్ని సోమవారం ఏపీ సీఎం వైఎస్ జగన్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో

Pawan kalyan:బ్రిడ్జిలు కట్టమంటే.. ఇంటింటికి స్టిక్కర్లు వేస్తారు, ప్రశ్నిస్తే కేసులు : జగన్ పాలనపై పవన్ విమర్శలు

తూర్పుగోదావరి జిల్లా మలికిపురంలో జరిగిన వారాహి విజయయాత్ర సభలో పాల్గన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్థానిక సమస్యలను ప్రస్తావించారు.