SIIMA Awards 2023 : నా ప్రతి కన్నీటి చుక్కకూ వాళ్లు బాధపడ్డారు.. వారికి పాదాభివందనం , ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్

  • IndiaGlitz, [Saturday,September 16 2023]

దుబాయ్ వేదికగా జరుగుతున్న సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) 2023 వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రెండు రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలో నటనకు గాను ఉత్తమ నటుడిగా జూనియర్ ఎన్టీఆర్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎమోషనల్‌ అయ్యారు.

నన్ను నమ్మిన నా జక్కన్నకు థ్యాంక్స్ చెప్పారు. ఆర్ఆర్ఆర్‌లో తనతో పాటు నటించిన రామ్‌చరణ్‌కు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. ఆయనను బ్రదర్ అంటూ సంబోధించిన ఎన్టీఆర్.. ఆ తర్వాత అభిమానుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. ‘‘ నేను జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పుడల్లా నన్ను పట్టుకుని పైకి లేపినందుకు, నా కంటి వెంట వచ్చిన ప్రతి నీటి చుక్కకు వాళ్లు కూడా బాధపడ్డారు. నేను నవ్వినప్పుడల్లా సంతోషపడ్డారు.. నన్ను అభిమానించే వారందరికీ పాదాభివందనం చేస్తున్నాను’’ అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరోవైపు.. ఆర్ఆర్ఆర్ చిత్రానికి సైమా పట్టం కట్టింది. ఉత్తమ నటుడిగా జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడిగా రాజమౌళి, సంగీత దర్శకుడిగా ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్, ఛాయాగ్రాహకుడు సెంథిల్ కుమార్‌లు అవార్డులు అందుకున్నారు. అయితే రాజమౌళి కుటుంబం ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. రాజమౌళి తరపున జూనియర్ ఎన్టీఆర్, కీరవాణి తరపున చంద్రబోస్ అందుకున్నారు.

More News

YSR Kapu Nestham : కాసేపట్లో వైఎస్సార్ కాపు నేస్తం నిధులను విడుదల చేయనున్న జగన్

ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ కాపునేస్తం ద్వారా ఆర్ధిక సాయాన్ని నేడు అందజేయనున్నారు

Bigg Boss 7 Telugu : అంతా ఫేక్‌ మనుషులే.. నేనుండలేను, గౌతమ్‌తో ప్రిన్స్ గొడవ.. సందీప్‌పై శివాజీ ఆరోపణలు

పవర్ అస్త్ర, మాయా అస్త్రతో ఇంటి సభ్యుల మధ్య చిచ్చు పెట్టేందుకు బిగ్‌బాస్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు.

Navdeep : డ్రగ్స్ కేసులో నవదీప్‌కు బిగ్‌రిలీఫ్ .. అరెస్ట్‌ చేయొద్దు, పోలీసులకు హైకోర్ట్ ఆదేశాలు

మాదాపూర్ డ్రగ్స్ కేసు టాలీవుడ్‌ను మరోసారి ఓ కుదుపు కుదిపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అరెస్ట్ అయిన వారిలో ఓ సినీ నిర్మాత వుండగా..

Chandrababu Naidu:స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం .. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ 19కి వాయిదా

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదాపడింది.

AP CM YS Jagan:ఆరోగ్యాంధ్రప్రదేశే జగన్ లక్ష్యం.. ఏపీ వైద్య రంగంలో కీలక మైలురాయి, ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌లు ఓపెనింగ్

ఒక రాష్ట్రం అద్భుతంగా పురోగతి సాధించడానికి విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు అత్యంత కీలకం.